Ram Gopal Varma: భీమ్లా నాయక్‌పై ఆర్జీవీ ట్వీట్.. ఎవరూ ఊహించని విధంగా..

Ram Gopal Varma: భీమ్లా నాయక్ చూసిన ఆర్జీవీ ట్విట్టర్ ద్వారా తన సమీక్షను పంచుకున్నారు.

Update: 2022-02-25 08:57 GMT

Ram Gopal Varma: వివాదాల వర్మ సడెన్‌గా ఏంటి ఇలా మారిపోయారు.. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మాట్లాడే వర్మకి భీమ్లానాయక్‌ అంత బాగా నచ్చిందేంటో.. ఏ మాత్రం విమర్శించినా పవన్ ఫ్యాన్స్ ఉతికి ఆరేస్తారనుకున్నాడో ఏమో.. మొదట్నించీ భీమ్లానాయక్ పట్ల పాజిటివ్‌గానే స్పందిస్తున్నాడు.

నిన్నగాక మొన్న విడుదలైన ట్రైలర్‌ని చూసి రానాను ప్రమోట్ చేయడానికి పవన్‌ని ఉపయోగించుకున్నారని అని ట్రైలర్‌పై విరుచుకుపడ్డాడు.. అయితే అదే క్రమంలో పవన్ కళ్యాణ్ నటనను మెచ్చుకున్నారు. పవన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.


భీమ్లా నాయక్ చూసిన ఆర్జీవీ ట్విట్టర్ ద్వారా తన సమీక్షను పంచుకున్నారు. ఈ చిత్రంలో పవన్ ఓ మెరుపు, సునామీ. రానా కూడా పవన్‌తో పోటీ పడి నటించాడు అని రాసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గురించి ఆర్జీవీ నిజంగానే పాజిటివ్‌గా ట్విట్ చేయడం చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. తాను పవన్ కళ్యాణ్‌కి వీరాభిమానిని అని చెప్పుకుంటున్నప్పటికీ, పవన్ గురించి ఎప్పుడూ మంచిగా మాట్లాడింది లేదు.

'భీమ్లానాయక్ ఓవరాల్ ఒక భూకంపం' అని ఆర్జీవీ ట్వీట్ చేస్తూ.. బాలీవుడ్‌లో కూడా విడుదల చేయాల్సిన సినిమా ఇది అని ట్వీట్ చేశారు. "నేను పదేపదే చెబుతున్నట్లుగా, హిందీలో కూడా #భీమ్లానాయక్‌ని విడుదల చేస్తే అది సంచలనం సృష్టించి ఉంటుంది." అని రాసుకొచ్చారు.


భీమ్లా నాయక్ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాశారు. ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ కథానాయికలు. స్క్రీన్‌ప్లే, డైరెక్షన్, నటీనటుల మధ్య కెమిస్ట్రీతో పాటు థమన్ సంగీతం భీమ్లా నాయక్‌ని అంతెత్తున నిలబెట్టింది.

అందుకే సినిమా చూసిన ప్రేక్షకులు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. అద్భుతమైన స్పందనను కనబరుస్తున్నారు. భీమ్లానాయక్ సృష్టిస్తున్న ప్రభంజనంతో థియేటర్లన్నీ కళకళలాడుతున్నాయి. ఇండస్ట్రీలోని వారికి ఓ కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది భీమ్లానాయక్. 

Tags:    

Similar News