Director Shankar : డైరెక్టర్ శంకర్ కొడుకు హీరో అవుతున్నాడు

Update: 2025-08-06 11:33 GMT

హీరోల కొడుకులు హీరోలు అవుతారు.. దర్శకుల కొడుకులు దర్శకులు లేదా హీరోలు అవుతారు. తమిళ టాప్ స్టార్ దళపతి విజయ్ తనయుడు అనూహ్యంగా దర్శకత్వం ఎంచుకున్నాడు. ఇటు టాప్ డైరెక్టర్ శంకర్ తనయుడు మాత్రం హీరోగా కెరీర్ ఎంచుకున్నాడు. యస్.. శంకర్ తనయుడు ‘అర్జిత్ శంకర్’ హీరోగా ఓ సినిమా మొదలు కాబోతోంది. ఇప్పటికే శంకర్ కూతురు అదితి హీరోయిన్ గా తమిళ్ తో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తోంది. ఆమె బాటలో సోదరుడు అర్జిత్ కూడా నటన వైపు అడుగులు వేస్తున్నాడు. కుర్రాడు మరీ అందగాడేం కాకపోయినా చూడ్డానికి బానే ఉన్నాడు.

అట్లీ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన ఓ కుర్రాడు అర్జిత్ మూవీతో దర్శకుడుగా మారబోతున్నాడట. ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ప్రస్తుతానికి ఈ న్యూస్ మాత్రమే బయటకు వచ్చింది. ఇంకా ఇతర డీటెయిల్స్ ను త్వరలోనే తెలియజేస్తారట. సినిమా ఈ యేడాది నవంబర్ లో స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. శంకర్ కు దర్శకుడుగా ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్ నడుస్తోంది. ఈ టైమ్ లో ఎదిగొచ్చిన కొడుకు హీరో అవుతున్నాడు అంటే హ్యాపీయే కదా. మరి ఈ కుర్రాడు తను ఎంచుకున్న రంగంలో తండ్రిలా సక్సెస్ అవుతాడా లేదా అనేది చూడాలి.

Tags:    

Similar News