Director Shankar : హీరోగా శంకర్ కొడుకు.. ఆ సినిమాకి సీక్వెల్..!
Director Shankar : కమర్షియల్ సినిమాలకి సందేశాన్ని జోడించి తెరకెక్కించడంలో దర్శకుడు శంకర్ సిద్ధహస్తుడు..;
Director Shankar : కమర్షియల్ సినిమాలకి సందేశాన్ని జోడించి తెరకెక్కించడంలో దర్శకుడు శంకర్ సిద్ధహస్తుడు.. మొదటి సినిమా జెంటిల్ మెన్ నుంచి ఇప్పటివరకు నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఇదే ఫాలో అవుతున్నాడు శంకర్. కమల్, రజనీ, విక్రమ్ లాంటి స్టార్స్ కి తమ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించిన శంకర్ ఇప్పుడు తన కొడుకు అర్జిత్ ని గ్రాండ్ గా లాంచ్ చేయనున్నాడు.
2004లో శంకర్ నిర్మించిన కాదల్ చిత్రం (తెలుగులో ప్రేమిస్తే )ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే.. ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేశాడు శంకర్.. ఈ సినిమాతోనే తన కొడుకు అర్జిత్ ని లాంచ్ చేయనున్నాడట శంకర్.. ఈ సినిమాని శంకర్ నిర్మిస్తుండగా, బాలాజీ శక్తివేల్ దర్శకత్వం వహించనున్నాడు. కాగా ఇటీవల డిగ్రీ పొంది ప్రొఫెషనల్ డాక్టర్‌గా మారిన శంకర్ కూతురు అదితి శంకర్.. హీరో కార్తీకి జోడీగా 'విరుమాన్' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది.
అటు దర్శకుడు శంకర్ ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ తేజ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.