NTR : మళ్లీ జన్మ ఉంటే ఎన్టీఆర్ ఎలా పుట్టాలనుకుంటున్నాడో తెలుసా..

Update: 2025-04-03 08:31 GMT

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్ట్రాంగ్ లైనప్ తో దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ తో వచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ ను నిలబెట్టుకుంటూ ఆ రేంజ్ స్టోరీస్ నే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో దేవరతో ప్యాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2తో రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదల కాబోతోంది. అలాగే ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ మూవీ చిత్రీకరణలో ఉంది. డ్రాగన్ 2026 జనవరి 9న విడుదలవుతుంది.

ఇక మార్చి 28న దేవర చిత్రాన్ని జపాన్ లో విడుదల చేశారు. ఆ సందర్భంగా ఎన్టీఆర్, కొరటాల శివతో కలిసి స్వయంగా వెళ్లి అక్కడ ప్రమోషన్స్ చేశాడు. ఆ ప్రమోషన్స్ సందర్భంగా ఎన్టీఆర్ కు అద్భుతమైన ఆతిథ్యం కూడా వచ్చింది. చాలామంది అభిమానులు అతనితో ఇంటరాక్ట్ అయ్యారు. అయితే ఇంటర్వ్యూస్ సందర్భంగా ఎన్టీఆర్ కు ఓ ప్రశ్న ఎదురైంది. అదేంటంటే.. మళ్లీ జన్మంటూ ఉంటూ.. ఎలా పుట్టాలనుకుంటున్నారు అని. దీనికి ఆయన ఏ తాతగారిలాగానో లేక ఇలాగే అనో సమాధానం చెప్పలేదు.

మరు జన్మ ఉంటే ఓ గొప్ప చెఫ్ (వంటవాడు)గా పుట్టాలనుకుంటున్నాను అని చెప్పాడు. అలాగే జపాన్ లో ఫేమస్ వంటకంలో మరింత ఎక్స్ పర్ట్ అనిపించుకోవాలనుకుంటున్నా అని చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఇండస్ట్రీ మొత్తం తెలుసు ఎన్టీఆర్ మాంచి చేయి తిరిగిన వంటకాడు అని. అందుకే ఇలా చెప్పాడేమో కానీ.. ఇలా చెప్పడం మాత్రం చాలామందిని ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి.

Tags:    

Similar News