Tollywood : పుష్ప-2 లో శ్రీలీల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Update: 2024-11-11 10:15 GMT

పుష్ప-2 సినిమాలో ఐటమ్ సాంగ్ అప్ డేట్ వచ్చేసింది. కిస్సిక్ అంటూ సాగే ఈ పాటలో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల.. అల్లు అర్జున్ తో స్టెప్పులేయబోతోంది. ఐదు రోజుల పాటు ఈ సాంగ్ షూట్ జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న ‘పుష్ప 2 ది రూల్' మూవీ డిసెంబర్ 5న విడుదలవుతోంది. అల్లు అర్జున్ తో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల అలరించబోతోంది. ఈ పాట వినడానికి, చూడటానికి కూడా చాలా బాగుంటుందని మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇద్దరు డ్యాన్సింగ్ స్టార్స్ కలిసి స్టెప్స్ వేస్తే చూడటానికి రెండు కళ్లు సరిపోవని అంటున్నారు. శ్రీలీల కవ్వించే పోజు వైరల్ అవుతోంది. కిస్సిక్ పాట 3 నిమిషాలకు పైగా డ్యూరేషన్ ఉంటుందని తెలుస్తోంది. శ్రీలీల ఒక్కో సినిమాకు ఇప్పుడు 80 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ఐతే.. కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఐతే.. ఈ క్రేజీ మూవీలో ఐటమ్ పాట కోసం శ్రీలీల కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News