Shruti Haasan : పెళ్లిపై ప్రశ్నలే అడగొద్దు.. ఖరాఖండిగా చెప్పిన శృతి

Update: 2025-01-28 11:15 GMT

విఖ్యాత నటుడు కమల్ హాసన్ తనయ శ్రుతి హాసన్. తండ్రి తో 'హే రామ్' సినిమాలో నటించి.. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కెరియర్ తొలినాళ్లలో ఫ్లాప్లో ఇబ్బందిపడ్డ ఈ అమ్మడు తక్కువ సమయంలోనే దక్షిణాదిలో అగ్ర హీరోయిన్ గా ఎదిగింది. 2008లో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. సోహం షా దర్శకత్వంలో తెరకెక్కిన 'లక్' సినిమాలో ఇమ్రాన్ ఖాన్ సరసన హీరోయిన్ గా తొలిసినిమా చేసింది. ఆ సినిమా ఘోరపరా జయాన్ని చవిచూసింది. శ్రుతికి తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నది.

2012లో గబ్బర్ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నటించింది శ్రుతి. ఈ సినిమా శ్రుతి కెరీర్ ను మలుపు తిప్పింది. తర్వాత తెలుగు తమిళంలో వరుస అవకాశాలు వచ్చాయి. శ్రుతి అసలు పేరు రాజ్యలక్ష్మి హాసన్.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక శ్రుతి హాసన్ గా మారింది. ఇవాళ ఈ అమ్మడి 39వ బర్త్ డే. పెళ్లి గురించి ప్రస్తా విస్తే చాలు ఫైర్ అవుతోంది శ్రుతి.

ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో మీడియా అడిగిన ప్రశ్నలకు సీరియస్ గా స్పందించింది. 'నాకు ప్రేమించడం ఇష్టం. ప్రే మించిన వ్యక్తితో కలిసి ప్రయాణించడం అమితమైన ఇష్టం. అయితే, ప్రేమించిన వ్యక్తినే పెళ్ళిచేసుకోవాలనే విషయంపై ఆలోచన చేయలేదు. నా పెళ్ళి గురించే ఎందుకు అడుగుతు న్నారు? మీరేమైనా నా పెళ్ళికి కరెంట్ బిల్లు చెల్లిస్తారా? లేదా పెళ్ళి భోజనాలు పెడతారా? ఈ రెండు కాకుంటే, నా పెళ్లి వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేయించి ఇస్తారా?' అంటూ ఫైర్ అయ్యింది. ఇక నుంచి తనను పెళ్లిపై ప్రశ్నలే అడగొద్దని కరాఖండీగా చెప్పందీ అమ్మడు.

Tags:    

Similar News