ఏజ్ తో పాటు అందమూ పెరుగుతున్న బ్యూటీ త్రిష. ఇండస్ట్రీకి వచ్చి 20యేళ్లు దాటినా ఇంకా నవ యవ్వనంగానే కనిపిస్తోంది. తన తరం హీరోయిన్లెవరికీ లేని విధంగా ఇప్పటికీ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూనే ఉంది. తెలుగులో మెగాస్టార్ తో విశ్వంభర చేస్తోంది. తమిళ్ లో కమల్ హాసన్ థగ్ లైఫ్ తో పాటు అజిత్ సరసన విడా ముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలు చేస్తోంది. ఇవి కాక మళయాలంలో మోహన్ లాల్ తో రామ్ అనే మూవీ పూర్తయి ఉంది. ఇలా చాలా బిజీగా ఉన్న త్రిష తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఆ స్టేట్మెంట్ఏంటంటే.. ‘నాకు విడాకులపై నమ్మకం లేదు. ఇప్పటికీ నాకు తెలిసిన ఎంతోమంది సరైన కారణాలు లేకుండానే మ్యారేజ్ లైఫ్ లోకి వెళుతున్నారు. అలాంటి పెళ్లి నాకొద్దు. నాకు నచ్చేవాడు వచ్చేదాకా ఎదురు చూస్తా. ఒకవేళ దొరక్కపోయినా నాకు ఇబ్బంది లేదు. ఇలా సింగిల్ గానే ఉంటా..’ ఇదీ ఆ స్టేట్మెంట్. మరి ఇది ఏ సందర్భంలో అన్నదో కానీ.. ఇప్పటికే తమిళనాడులో తనపై ఓ కొత్త రూమర్ స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. ఈ టైమ్ లో విడాకులు, పెళ్లొద్దు అంటే ఇంకా డౌట్స్ వస్తాయి కదా.
ఇంతకీ ఆమెపై రూమర్ ఏంటా అనే కదా.. అక్కడి టాప్ హీరో విజయ్ తో తను లివ్ ఇన్ రిలేషన్ లో ఉందనేదే రూమర్. ఇది చాలా రోజులుగా వినిపిస్తున్నదే. తనకు షూటింగ్ లేకపోతే.. ఎక్కువగా విజయ్ తోనే ఉంటుందంటారు. అలాగే అతని షూటింగ్ లొకేషన్ లో కూడా కనిపిస్తుంటుందట. మరి ఇందులో నిజమెంతో కానీ.. ఈ రూమర్ అయితే కోలీవుడ్ చాలా రోజులుగా గట్టిగానే వినిపిస్తోంది. ఇంకొందరైతే ఏకంగా విజయ్ తన భార్యకు విడాకులిచ్చి త్రిషను పెళ్లి చేసుకుంటాడు అని కూడా అంటున్నారు. ఏంటో.. ఈ గోల అనిపిస్తోంది కదా..?