Mahavatar Narasimha : మహావతార్ నరసింహపై రూమర్స్

Update: 2025-08-06 04:34 GMT

మహావతార్ నరసింహ.. పిల్లల సినిమాగా వచ్చి పెద్దలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ తో క్రియేట్ చేసిన ఈ యానిమేషన్ మూవీ ఇండియా మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇప్పటికే వంద కోట్ల వసూళ్లను దాటేసింది. చాలా ఈజీగా 150 కోట్ల మార్క్ ను టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. భక్త ప్రహ్లాద కథే అయినా చెప్పిన విధానం.. అందులో మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ను యాడ్ చేసిన తీరు ఆడియన్స్ ను ఉర్రూతలూపుతోంది. దీనికి తోడు శ్యామ్ సిఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్ ను హైలెట్ చేస్తూ అదరగొడుతోంది.

ఇక ఈ చిత్రానికి సంబంధించి కొన్ని రోజులుగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ విషయంలోనే టీమ్ అలెర్ట్ అయింది. మహావతార్ నరసింహా సినిమా ఫలానా తేదీ నుంచి ఫలానా ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ కాబోతోంది అనేదే ఆ న్యూస్.థియేటర్స్ లో మంచి రన్ ఉన్న మూవీస్ కు ఇలాంటి వార్తలు చేటు చేస్తాయి. అది కలెక్షన్స్ పై ప్రభావం చూపిస్తుంది. అందుకే మూవీ టీమ్ నుంచి ఓ అప్డేట్ వచ్చింది.

"ప్రపంచ వ్యాప్తంగా మా సినిమా మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. త్వరలోనే ఓటిటిలోకి రాబోతోంది అనే అంశంపై క్లారిటీ ఇవ్వదలిచాం. ఇప్పటి వరకూ మా సినిమా కేవలం థియేటర్స్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అసలు మేం ఇంకా ఏ ఓటిటి డీల్ ను ఫైనల్ చేసుకోలేదు. అందుకే త్వరలోనే ఓటిటిలోకి అనే వార్తలను నమ్మొద్దు. అవి ఉట్టి పుకార్లు మాత్రమే. మా అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి వచ్చే అథెంటిక్ వార్తలను మాత్రమే అప్డేట్స్ గా చూడాలని మనవి.." అంటూ క్లారిటీ ఇచ్చింది. సో.. అసలు ఓటిటి డీల్ ఫైనలే కాని సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ వస్తుందని చెప్పడం పూర్తి అబద్ధమే. కాబట్టి అవన్నీ గాసిప్స్ అనే అనుకోవచ్చు. 

Tags:    

Similar News