Rakul Preet : నేను చేసిన తప్పు మీరు చేయొద్దు: రకుల్ ప్రీత్

Update: 2024-12-10 06:45 GMT

కొన్ని రోజుల క్రితం వర్కౌట్ చేస్తూ గాయపడిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇన్‌స్టాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిమితికి మించి వర్కౌట్లు చేసి తప్పు చేశానని, ఆ తప్పు ఇంకెవ్వరూ చేయొద్దని కోరారు. గాయం నుంచి ఇప్పుడే కోలుకుంటున్నట్లు తెలిపారు. ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ బ్యూటీ కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరమయ్యారు.

ప్రస్తుతం ఎక్కువ బరువులు ఎత్తడం లేదని రకుల్ చెప్పారు. చిన్నచిన్న వర్కౌట్లు చేస్తున్నానని... ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నానని తెలిపారు. బరువు తగ్గడం ఎంతో కష్టమైన పని అని, ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలని సూచించారు. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని, రెగ్యులర్ గా వర్కౌట్లు చేయాలని చెప్పారు.

మంచి నీళ్లు ఎక్కువగా తాగాలని రకుల్ సూచించారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే గోరు వెచ్చటి నీరు లేదా పసుపు కలిపిన గోరు వెచ్చటి నీరు తాగితే చర్మం కాంతివంతంగా తయారవుతుందని చెప్పారు.

Tags:    

Similar News