Double Ismart: మార్చి 8న థియేటర్లు అదిరిపోవాల్సిందే...
'డబుల్ ఇస్మార్ట్' విడుదల తేదీ రిలీజ్.. ముంబై షెడ్యూల్ కంప్లీట్ చేసిన పూరీ;
దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో హీరో రామ్ పోతినేని లేటెస్ట్ ఫిల్మ్ 'డబుల్ ఇస్మార్ట్' పై మేకర్స్ ఓ క్రేజీ న్యూస్ ను ప్రకటించారు. దాంతో పాటు మూవీ రిలీజ్ డేట్ పైనా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 8న విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ముంబయిలో భారీ సెట్ వేసినట్టు వార్తలు వచ్చాయి. ప్రధాన నటీనటులు ఈ చిత్రీకరణలో పాల్గొన్నారని కూడా కొన్ని నివేదికలు సూచించారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ .. ఈ సినిమాకు సంబంధించి ముంబై షెడ్యూల్ కంప్లీట్ అయిందనే క్రేజీ అప్ డేట్ ను రివీల్ చేశారు. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన పూరీ, నటి చార్మీ.. డబుల్ ఇస్మార్ట్.. యాక్షన్-ప్యాక్డ్ ఫస్ట్ షెడ్యూల్ ముంబైలో విజయవంతంగా పూర్తి చేసుకుంది. తదుపరి మ్యాడ్ క్రేజీ షెడ్యూల్ భారతదేశంలో చిత్రీకరించబడుతుందని చెప్పారు. దాంతో పాటు డబుల్ ఇస్మార్ట్ మార్చి 8, 2024న థియేటర్లలో రిలీజ్ కానుందని వెల్లడించారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పూరీ ఇచ్చిన అప్ డేట్ పై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Team #DoubleISMART successfully completed the action-packed First Schedule in Mumbai and the next mad crazy schedule will be shot out of India 🔥
— Puri Connects (@PuriConnects) July 31, 2023
IN CINEMAS MARCH 8th, 2024💥
Ustaad @ramsayz #PuriJagannadh@duttsanjay @Charmmeofficial @IamVishuReddy @PuriConnects pic.twitter.com/vaW8G8mEgc
ఇక పూరీ ఈ సినిమా షూటింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడనే టాక్ వినిపిస్తోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ లో చేసిన తప్పుల్ని మళ్లీ మళ్లీ చేయకుండా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే తన సినిమాల షూటింగ్‌ని చాలా ప్లాన్డ్ షెడ్యూల్స్‌తో త్వరితగతిన పూర్తి చేసే ఇమేజ్‌ని కలిగి ఉన్న పూరి జగన్నాధ్ .. గతంలో చేసిన చాలా సినిమాల షూటింగ్‌లను 6 నెలల లోపే పూర్తి చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరిగేలా చూసుకుంటాడు, కానీ తన మునుపటి చిత్రానికి అన్నీ తప్పుగా జరిగాయి. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర పరాజయం పాలైంది.
Successfully completed our 1st action-packed schedule and now time to fly out of India for our yet another maaddd crazy shoot 😀#DoubleISMART
— Charmme Kaur (@Charmmeofficial) July 31, 2023
IN CINEMAS MARCH 8th, 2024💥
Ustaad @ramsayz #PuriJagannadh@duttsanjay @IamVishuReddy @PuriConnects pic.twitter.com/CVlAff4TiK