Dulquer Salmaan: హీరోగా చేస్తానంటే పరువుతీయొద్దన్నారు: దుల్కర్ సల్మాన్
Dulquer Salmaan: మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకుంటున్నారు.. తాజాగా అతడు నటించిన చిత్రం సీతారామం సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది.;
Dulquer Salmaan: మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకుంటున్నారు.. తాజాగా అతడు నటించిన చిత్రం సీతారామం సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది.ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ప్రేక్షకులు సీతారామంకి బ్రహ్మరథం పడుతున్నారు. హనురాఘవపూడి దర్శకత్వంలో, వైజయంతి మూవీస్ బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రం ఆగస్ట్ 5న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో జరిగిన ఇంటర్వ్యూలో దుల్కర్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
తన తండ్రి మమ్ముట్టి గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. తాను కూడా సినిమాల్లోకి వస్తానని చెప్పినప్పుడు తండ్రి బాధపడినట్లు చెప్పాడు. సినిమాల్లోకి రావడం నాన్నకు ఇష్టం లేదు.. అందుకే ఫైట్లు, డ్యాన్సులు నేర్పించలేదు. ఆయన చెప్పినట్టుగానే చదువుకుని దుబాయ్‌లో కొంతకాలం ఉద్యోగం చేశాను. కానీ కూర్చున్న చోటు నుంచి కదలకుండా చేసే ఉద్యోగం చేయడం నావల్ల కాలేదు. అందుకే తిరిగి కేరళకు వచ్చేశాను. హీరోగా ట్రై చేస్తా అని నాన్నతో చెప్పాను. దానికి నాన్న చాలా బాధపడ్డారు.
ఆ తర్వాత ఇంట్లో పెద్ద గొడవే జరిగిందన్నారు. అంతకుముందెప్పుడూ ఆయన అంత కోపంగా ఉండడం చూడలేదు. యాక్టింగ్ అంటే నువ్వు అనుకున్నంత సులువు కాదు.. అది నీ వల్ల కాదు.. నా పరువు తీసే ఆలోచన చేయకు అని అన్నారు. అయినా నాకు సినిమాల్లో నటించాలన్న కోరిక ఎక్కువైంది. దాంతో నీ ఇష్టం అని వదిలేశారు. ఇప్పుడు తను నటించిన సినిమాలు చూసి సూచనలు, సలహాలు ఇస్తుంటారు అని దుల్కర్ పేర్కొన్నారు.