Prabhas : జపాన్ లో భూకంపం.. ప్రభాస్ సేఫా ..?

Update: 2025-12-09 11:25 GMT

జపాన్ లో భూకంపం వచ్చింది. ఉత్తర తీరంలో సంభవించింది ఈ భూకంపం. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ లో మాత్రం ఒక అలజడి మొదలైంది. అందుకు కారణం.. ఈ భూకంపం సంభవించిన ప్రాంతంలో ప్రభాస్ కూడా ఉన్నాడు. బాహుబలి ది ఎపిక్ మూవీ ప్రమోషన్స్ సందర్బంగా ప్రభాస్ అక్కడికి వెళ్లాడు. దీంతో ఆ ప్రమాదం విషయంలో ఆయన గురించి అంతా ఆరా తీస్తున్నారు. అయితే ప్రభాస్ కు ఎలాంటి ఇబ్బంది లేదు. భూకంపం సంభవించిన సమయంలో ఆయన అక్కడ లేడు అని దర్శకుడు మారుతి చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇక బాహుబలి ది ఎపిక్ మూవీ ఈ నెల 12న జపాన్ లో విడుదల కాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే ప్రభాస్ అక్కడికి వెళ్లాడు. సినిమా కోసం ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యాడు. ఎప్పట్లానే ఆయన తనదైన శైలిలో సిగ్గుపడుతూనే మాట్లాడాడు. దీంతో పాటు ఆ మూవీ ప్రమోషన్ లో భాగంగా కనిపించిన అతని స్పిరిట్ మూవీ గెటప్ కూడా రివీల్ అయింది. దీంతో స్పిరిట్ మూవీ గెటప్ విషయంలో మిక్స్ డ్ ఒపీనియన్ కూడా వినిపించింది అందరిలో. మొత్తంగా ప్రభాస్ కు భూకంపంతో ఎలాంటి ఇబ్బంది లేదు అన్న విషయాన్ని మాత్రం తెలియజేశారు. 

Tags:    

Similar News