Tollywood Drug Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు.. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు..
Tollywood Drug Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు పెంచింది.;
Tollywood Drug Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. సీఎస్ సోమేష్‌కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్‌లపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేసింది. కెల్విన్ కూల్ ప్యాడ్‌లోని కాల్ రికార్డ్స్ ఇవ్వడం లేదని ఈడీ పేర్కొంది. తాము సేకరించిన ఆధారాలు ట్రయల్ కోర్టులో ఉన్నాయన్న.. ఎక్సైజ్ శాఖ వాదనలో వాస్తవం లేదని హైకోర్టుకు తెలిపింది ఈడీ. 12 కేసుల్లో 23 మంది నిందితులు ఉన్నా.. ఐదుగురు వాంగ్మూలాలు మాత్రమే ట్రయల్ కోర్టులో లభ్యం అయ్యాయని వెల్లడించింది.
సినీతారల కాల్ రికార్డ్స్ ఎక్సైజ్ శాఖ కోర్టుకు సమర్పించలేదని.. ఇప్పటి వరకు ఆరు లేఖలు రాసినా వివరాలు ఇచ్చేందుకు ఎక్సైజ్ శాఖ ససేమిరా అంటోందని ఈడీ ఆరోపిస్తోంది. సినీతారలు సహా 41 మందిని ఎక్సైజ్ శాఖ విచారించిందన్న ఈడీ.. డిజిటల్ రికార్డ్స్, వాంగ్మూలాలు, కాల్ రికార్డ్స్ ఇవ్వడం లేదని పేర్కొంది. కెల్విన్ కూల్ ప్యాడ్‌లో సినీతారల చిట్టా ఉందని ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. సమగ్ర దర్యాప్తు వివరాలు ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలు పాటించడం లేదని ఈడీ తెలిపింది. అయితే.. ఈడీ పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారించనుంది.