Venkatesh : వెంకటేష్ కోసం కార్తీనా లేక ఫహాద్ నా..?

Update: 2026-01-29 12:49 GMT

కొన్ని కాంబినేషన్స్ వినగానే భలే అనిపిస్తాయి. వీళ్ల కాంబోలో సినిమా వస్తోందంటే ఆడియన్స్ లో ఉండే క్రేజ్ వేరేగా ఉంటుంది. ఆ హీరోలు అంటే విక్టరీ వెంకటేష్ ప్రధానంగా వినిపిస్తోంది. అఫ్ కోర్స్ వెంకీ మెయిన్ హీరోగా నటిస్తున్నాడు. అతనికి తోడుగా ఉండే హీరో ఎవరు అంటే మాత్రం తమిళ్ హీరో కార్తీ పేరు, మళయాల స్టార్ ఫహాద్ ఫాజిల్ పేరు వినిపిస్తోంది. ఈ ఇద్దరు ఎవరో ఒకరు ఫైనల్ అవుతారు అనేది తెలియాల్సి ఉంది. కాకపోతే ఇద్దరు హీరోలు చాలా ప్రామిసింగ్ గా ఉంటారు. ఇద్దరులో ఎవరు ఒకరు మాత్రమే అన్నప్పుడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఇంతకీ వెంకటేష్ చేయబోతోన్న సినిమా ఎవరిదీ అనుకుంటున్నారు కదా. అనిల్ రావిపూడి.. యస్.. అనిల్ రావిపూడి మరోసారి వెంకీతోనే సినిమా చేయబోతున్నాడు.

అనిల్ రావిపూడి అంటే హిట్ మెషీన్ అని ప్రూవ్ అయింది. ఇప్పటి వరకు చేసింది 9 సినిమాలు. అన్నీ బ్లాక్ బస్టర్లే. ఒకటికి మించి ఒక హిట్ అందుకుంటున్నాడు. ఈ క్రమంలో సంక్రాంతికి వస్తున్నాం మూవీతో టాలీవుడ్ లోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనే ట్యాగ్ వచ్చింది. మన శంకర వరప్రసాద్ గారుతో ఆ రికార్డ్ ను తిరగరాశాడు. ఇక ఎఫ్2, ఎఫ్, సంక్రాంతికి వస్తున్నాం మూవీస్ తో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. మన శంకర వర ప్రసాద్ తో గెస్ట్ రోల్ లోనూ వెంకీతో మెప్పించాడు. అలాంటి వెంకీతో ఐదో సినిమాగా ఈ మూవీ ఉండబోతోంది అనే టాక్ బలంగా ఉంది.

వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో ఆదర్శ కుటుంబం అనే మూవీ చేస్తున్నాడు. ఇది సమ్మర్ లోనే విడుదల కాబోతోంది అని చెప్పారు. అంటే ఆ తర్వాత వెంటనే అనిల్ రావిపూడితో మూవీ స్టార్ట్ కాబోతోందన్నమాట. అలాగే ఈ మూవీని కూడా 2027 సంక్రాంతి బరిలో విడుదల చేయబోతున్నాడు అనిల్ రావిపూడి. వెంకీతో మూవీ అంటే చాలా వేగంగా చిత్రీకరణ పూర్తవుతుంది కదా. అందుకే ఈ చిత్రాన్ని కూడా కేవలం మూడు నెలల్లో కంప్లీట్ చేయడం అంత కష్టమేం కాదు. మొత్తంగా వెంకటేష్ తో పాటు కార్తీ లేదా ఫహాద్ ఫాజిల్ కాంబోలో ఓ మూవీ చేయబోతున్నాడు అనిల్ రావిపూడి అనేది ఆల్మోస్ట్ కన్ఫార్మ్. 

Tags:    

Similar News