ED investigation : అల్లు అరవింద్‌కు ఈడీ షాక్.. ఆ స్కాంలో విచారణ..

Update: 2025-07-05 05:45 GMT

ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ఈడీ విచారణకు హాజరయ్యారు. రామకృష్ణ, బ్యాంకులో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఈడీ అధికారులు ఆయనను 3 గంటలపాటు ప్రశ్నించారు. 2017-19 మధ్య రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ ,రామకృష్ణ టెలిట్రానిక్స్ అనే రెండు సంస్థలు కలిసి యూనియన్ బ్యాంక్ నుండి రూ.101 కోట్ల రుణం తీసుకున్నాయని, ఈ ఆర్థిక లావాదేవీలలో అల్లు అరవింద్‌కు సంబంధించిన సంస్థలకు సంబంధం ఉందని ఈడీ అనుమానిస్తోంది. ఈడీ అధికారులు రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థతో అల్లు అరవింద్‌కు చెందిన సంస్థల మధ్య అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలను గుర్తించారు. అల్లు అరవింద్‌ను ఈ కుంభకోణానికి సంబంధించి పలు ప్రశ్నలు వేసి, సుమారు మూడు గంటల పాటు విచారించినట్లు సమాచారం. వచ్చే వారం మళ్ళీ విచారణకు రావాలని ఆదేశించినట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది..

Tags:    

Similar News