Viplav : బాధ్యతాయుతమైన సినిమాలా కనిపిస్తోన్న ‘ ఈ సారైనా’..

Update: 2024-11-05 09:59 GMT

యూత్ ఫుల్ మూవీ అంటే ఎలా ఉండాలి..? కుదిరనప్పుడల్లా బూతు డైలాగ్స్, అదే పనిగా మందు సన్నివేశాలు, అర్ధనగ్న హీరోయిన్లు, తల్లి తండ్రులను లెక్క చేయని హీరో.. కటౌట్ ను దాటి చేసే ఫైట్స్... ఇది కూడా చాలా ఎక్కువగా అనుకునే భావన. కాస్త అటూ ఇటూగా యూత్ ఫుల్ మూవీ అంటే దాదాపుగా ఇవే కనిపిస్తున్నాయిప్పుడు. ఇలాంటి తరుణంలో ఓ బాధ్యతాయుతమైన యూత్ ఫుల్ మూవీ వస్తే ఎలా ఉంటుంది.. అంటే ఇదుగో ఇలా ఉండొచ్చు.. ‘‘ఈ సారైనా’’ అనే ఈ మూవీ ట్రైలర్ చూసినప్పుడు అనిపిస్తుంది.

ఈ సారైనా.. అనే ఈ మూవీ టైటిల్ చూసినప్పుడు చాలామంది మరో రొటీన్ యూత్ మూవీ అనుకున్నారు. బట్ ట్రైలర్ ఊహలను మార్చివేసింది. ట్రైలర్ చూడగానే బలే ఉందే అనిపిస్తుంది. ఓ చిన్న ఊరు.. తను ప్రేమించే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఉద్యోగం కావాలి. అందుకోసం ప్రయత్నాలు చేసే కుర్రాడు. ప్రతిసారీ జాబ్ మిస్ అవుతున్నా.. ఈ సారైనా వస్తుందనే ఆశతో కుర్రాడు.. అతన్ని నిరంతరం ఎంకరేజ్ చేస్తూ.. ‘జాబ్ రాకపోయినా ఫర్వాలేదు కానీ.. ఇలా ఇన్ డిసిప్లిన్ గా ఉంటే మాత్రం నాకస్సలు నచ్చదు’ అని చెప్పే అమ్మాయి.. ఈ జంటను చూస్తుంటే ముచ్చటేసింది. అదే టైమ్ లో ఉద్యోగం అవసరం లేదని డిస్కరేజ్ చేసే ఫ్రెండ్స్. వీరి మధ్య కుటుంబ కలహాలు... వీటిని దాటుకుని హీరో ఈ సారైనా ఉద్యోగం సంపాదించాడా లేదా అనేది సినిమాలో చూడాలి అనేట్టుగా ఉందీ ట్రైలర్.

ఈ నెల 8న విడుదల కాబోతోన్న ఈ సారైనా మూవీకి విప్లవ్ తనే స్టోరీ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తో పాటు నిర్మాతగా, దర్శకుడుగా, ఎడిటర్ అన్ని శాఖలను నిర్వహిస్తూ హీరోగా నటించాడు. అశ్విని హీరోయిన్ గా నటించింది.

ఇలాంటి రెస్పాన్సిబుల్, రెస్పక్టబుల్ సినిమాలు బాగా అరుదైపోయాయి తెలుగులో. ఈ టైమ్ లో వస్తోన్న ఈ మూవీ కంటెంట్ కూడా బావుండి.. ఆడియన్స్ ను చూస్తున్నంత సేపూ ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా వర్కవుట్ అవుతాయి. కాకపోతే ప్రాపర్ ప్రమోషన్స్ కావాలి. అప్పుడే చాలా ఎక్కువ రేంజ్ లో ఆడియన్స్ కు రీచ్ అవుతుంది.

Full View

Tags:    

Similar News