Kiran Abbvaram : మాజీ హీరోయిన్లతో కే ర్యాంప్ ఆడిస్తున్నారా..?

Update: 2025-09-01 07:25 GMT

ఆఫర్స్ తగ్గిన హీరోయిన్లు హాట్ నెస్ పెంచడం.. ఆ డోస్ తో కొత్త ఆఫర్స్ అందుకోవడం మామూలుగానే చూస్తున్నాం. కొందరికి హీరోయిన్ గా కాక స్పెషల్ సాంగ్స్ లో ఆఫర్స్ వస్తుంటాయి. ఈ రెండూ కోల్పోయిన బ్యాచ్ ఒకటుంటుంది. వాళ్లు అదే పనిగా సోషల్ మీడియాను హీటెక్కిస్తూనే ఉంటారు. బట్ ఎవరూ పట్టించుకోరు. ఆ జాబితాలో కనిపించే పేరు విమలా రామన్. ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన ఈ భామ 2006లో ఉదయ్ కిరణ్ సరసన ‘పొయ్’అనే తమిళ్ మూవీతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఇదే చిత్రం తెలుగులో అబద్ధం అనే పేరుతో డబ్ అయింది. సినిమా పోయింది. విశేషం ఏంటంటే.. ఈ చిత్రానికి లెజెండరీ కే బాలచందర్ దర్శకుడు. తర్వాత తమిళ్, మళయాలంలో టాప్ స్టార్స్ తో నటించింది. తెలుగులో ఎవరైనా ఎపుడైనా అనే మూవీతో వరుణ్ సందేశ్ సరసన పరిచయం అయింది. ఈ మూవీ పోయినా తర్వాత తెలుగులో కొన్ని ఆఫర్స్ అందుకుంది కానీ స్టార్డమ్ రాలేదు. రీసెంట్ గా తెలుగులో రుద్రాంగి, అంతిమ తీర్పు అనే సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ తో కొత్త జర్నీ మొదలుపెట్టిన తను ఇప్పుడు ఏకంగా తల్లి పాత్రలకు షిఫ్ట్ అయిపోయింది.

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తోన్న ‘కే ర్యాంప్’మూవీలో అతనికి తల్లిగా కనిపించబోతోంది విమలా రామన్. ఇప్పటికీ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అదరగొడుతోన్న తను సడెన్ గా తల్లి పాత్రకు మారడం కొంత ఆశ్చర్యమే. విశేషం ఏంటంటే.. ఇదే చిత్రంలో మరో హాట్ బ్యూటీ కామ్న జెఠ్మలానీ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతోందట. తను కూడా తెలుగులో 2005లో ప్రేమికులు అనే చిత్రంతో పరిచయం అయింది. గోపీచంద్ రణంతో హిట్ అందుకున్నా తర్వాత స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. సో.. ఇప్పుడీ మాజీ హీరోయిన్లు ఇద్దరూ తెలుగు నుంచే కే ర్యాంప్ తో కొత్త జర్నీ మొదలుపెట్టబోతున్నారు. మరి ఈ ఇన్నింగ్స్ వీళ్లు ర్యాంప్ ఆడిస్తారా లేదా అనేది చూడాలి. 

Tags:    

Similar News