Ram Charan : రామ్ చరణ్ ఈ సారి పెద్ద మాయే చేసేలా ఉన్నాడు

Update: 2026-03-03 08:30 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత చేసిన ఆచార్య బిగ్ డిజాస్టర్ అయింది. తర్వాత గేమ్ ఛేంజర్ పై చాలా అంచనాలున్నా అదీ పోయింది. ఈ టైమ్ లో మళ్లీ తెలుగు వరకే పరిమితం అవుతాడా అనుకున్నారు. బట్ పెద్ది మూవీతో ఏదో మాయ చేయబోతున్నాడు అనిపించేలా ఉన్నాడు. ఈ మూవీ గ్లింప్స్ అద్భుతం అనిపించుకుంది. తర్వాత వచ్చిన పాట అదరగొట్టింది. తాజాగా వచ్చిన మరో పాట ఈ సారి ఇంకా బావుంది అనిపించుకుంది. మామూలుగా ఇలాంటివి హీరో ఇంటర్ డక్షన్ సాంగ్స్ లా ఉంటాయి. బట్ అలాంటి పాటే అయినా అందులోని సాహిత్యం బాగా ఆకట్టుకుంది. అదే పాటలో హైలెట్ గా నిలిచింది. ముందు ఇది సరిగా లేదే అనిపిస్తుంది. వినగా వినగా మాత్రం అరే బలే ఉంది సాహిత్యం అనిపిస్తుంది. మొదటైనా వెంటనే ఆకట్టుకోలేకపోవడానికి కారణం ఏఆర్ రెహమాన్ పాడటమే అంటే అతిశయోక్తి కాదు. అతనికంటే ఇంకాస్త తెలుగు బాగా తెలిసిన వాళ్లతో పాడిస్తే ఇంకా బావుండేది అనిపిస్తుంది.

‘ఆరు నూరైనా మందల్లోంచి వేరైరా.. భయ్యం పీకి పారేయ్‌రా సిగ్గుంటే సీరైరా.. జేకొట్టె పేరైరా.. నీ రాకచూసి లోకం చేసే హోరై రారా.. బెరుగ్గా ఇరుగ్గా పాతేసుకోకోయలా.. నిను నిన్నే నీ లోపలా పాతికేళ్లకే నువు పాతబడిపోకురా.. అనే పదాలు అద్భుతం అనిపించుకుంటాయి. దీంతో పాటు రెండో చరణంలో చూస్తే.. ‘మొండెంలో తల దించేటట్లయితే మొలతాడెందుకు కట్టావ్ తెంచేసెయ్.. నువ్ మొత్తం రక్తం మార్చుకొనొచ్చేసెయ్’అనడం చాలా బావుంది. అలాగే

‘ఆటనుకోకోయ్ ఆటంటే బతుకోయ్.. నీ ఆట బతకాలిరోయ్.. మాటనుకోకోయ్ గెలుపంటే వెలుగోయ్.. గెలుపై నువ్ వెలగాలిరోయ్..

మండే గుండె నీలో లేదంటే

కాలూ చెయ్యీ ఉన్నా లేనట్టే

నీకు నెగ్గే నైజం అర్థం కానట్టే...

ఇలా ఉంది పాట. మామూలుగా ఉంటూనే అర్థవంతంగా సాగడం ఈ సాహిత్యంలో ఉండే ప్రత్యేకత. అనంత శ్రీరామ్ రాసిన పాట ఇది. మామూలుగా ఇలాంటి ఉద్బోదంగా సాగే గీతాలు రాయడంలో చంద్రబోస్ ది బెస్ట్ గా అనిపిస్తాడు. బట్ ఈ సారి అనంత శ్రీరామ్ ఆకట్టుకున్నాడు. మొత్తంగా ఈ పాట సినిమాలో హైలెట్ గా ఉండబోతోంది అనిపించేలా ఉంది. 

Tags:    

Similar News