రసవత్తరంగా ఛాంబర్ అధ్యక్షుడి ఎన్నిక, టిడిపి వర్సెస్ వైసీపీగా మారిందా

Update: 2024-07-25 10:24 GMT

టాలీవుడ్ లో ఏ ఎన్నికలు జరిగినా సాధారణ సార్వత్రిక ఎన్నికలను తలపించడం మొదలై చాలాకాలం అయింది. కాకపోతే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నిక కాస్త బెటర్ గా ఉంది. బట్ ఈ సారి ట్రెండ్ మారింది. ప్రస్తుతం అధ్యక్షుడుగా ఉన్న దిల్ రాజు పదవీ కాలం ఈ నెల 31తో ముగిసిపోతుంది. దీంతో కొత్త అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి ప్రక్రియ మొదలైంది. ఈ సారి ఎన్నికలకు పొలిటికల్ హీట్ తగిలింది. ఏకంగా టిడిపి వర్సెస్ వైసీపీగా మారింది.

ఈ సారి అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న వారిలో భరత్ భూషణ్, ఠాగూర్ మధు బరిలో ఉన్నారు. వీరిలో ఠాగూర్ మధు తను వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తినని ఓపెన్ గానే చెప్పుకుంటారు. ఆ విషయం అందరికీ తెలుసు కూడా. ఇటు భరత్ భూషణ్ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్. సీనియర్. ఇతర డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు సినిమా పరిశ్రమ మొత్తంలోనూ మంచి వ్యక్తిగా పేరుంది. అలాగే ఆయన టిడిపికి కాస్త దగ్గరగా ఉంటాడు అని కూడా చెబుతారు. దీంతో ఈ సారి అనివార్యంగానే అధ్యక్షుడి ఎన్నికలో ఈ రెండు పార్టీల ప్రస్తావన కనిపిస్తోంది.

ప్రస్తుతం అధ్యక్షుడుగా ఉన్న దిల్ రాజు ఠాగూర్ మధుకు తన మద్ధతు తెలుపుతున్నాడు. గతంలో దిల్ రాజుతో పోటీ పడి ఓడిపోయిన సి కళ్యాణ్ టీమ్ భరత్ భూషణ్ కు సపోర్ట్ చేస్తోంది. మామూలుగా అయితే ఇది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష ఎన్నిక మాత్రమే. కానీ ఈసారి రాజకీయ రంగు పులుముకోవడంతో ఆయా పార్టీల ఇన్వాల్వ్ మెంట్ కూడా ఇన్ డైరెక్ట్ గా ఉండే అవకాశం ఉందంటున్నారు. అందుకే ఈ సారి ఛాంబర్ అధ్యక్ష ఎన్నిక గతంలో కంటే పూర్తి భిన్నంగా జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

అయితే ఈ ఎన్నికకు సంబంధించి మరో విశేషం ఏంటంటే.. ఇక్కడ కేవలం 48 ఓట్లు మాత్రమే ఉన్నాయి.

వీరిలో

ఎగ్జిబిటర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (16)

ప్రొడ్యూసర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (12)

డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (12)

స్టూడియో ఎక్సిక్యూటివ్ కమిటీ (4)

సెక్టార్ ప్రెసిడెంట్ ఓట్లు (4)

ఇలా మొత్తం 48 ఓట్లు మాత్రమే ఉన్నాయి.

పోటీ పడుతున్న వారిలో ఎవరికైతే 25 ఓట్లు వస్తాయో వాళ్లు గెలిచినట్టు. అయితే ఈ గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినట్టే అంటున్నారు. భరత్ భూషణ్ కు ఇప్పటికే 35 ఓట్లు కన్ఫార్మ్ అయి ఉన్నాయట. దీంతో దిల్ రాజు సపోర్ట్ చేసినా వైసీపీకి చెందిన ఠాగూర్ మధు ఓడిపోవడం ఖాయం అంటున్నారు. ఇప్పటికే ఓటమి దిగులు ఠాగూర్ మధు టీమ్ లో కనిపిస్తోందంటున్నారు. అయితే పైకి ఇందులో పాలిటిక్స్ కు చోటు లేదు అన్నట్టుగా ప్రచారం జరుగుతున్నా.. లోపల మాత్రం ఖచ్చితంగా ఇది టిడిపి వర్సెస్ వైసీపీగానే కనిపిస్తోందంటున్నారు చాలామంది. ప్రస్తుతం ఏపిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆ ప్రభావం ఈ ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలపై స్పష్టంగా కనిపించబోతోందని అందువల్ల భరత్ భూషణ్ విజయం దాదాపు ఖాయమే అని తెలుస్తోంది.

Tags:    

Similar News