మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ తో వచ్చిన క్రేజ్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లేలానే అతని లైనప్ కనిపిస్తోంది. వైవిధ్యమైన దర్శకులతో వర్క్ చేస్తుండటం కూడా కలిసొచ్చేదే అని చెప్పాలి. దేవరతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్ ఈ యేడాది బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 తో వస్తున్నాడు. ఆగస్ట్ 15న ఈ చిత్రం విడుదల కాబోతోంది. కాస్త నెగెటివ్ షేడ్స్ తో కనిపిస్తాడు అనే ప్రచారం జరుగుతోన్న ఈ మూవీలో హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ వర్క్ ఆల్మోస్ట్ అయిపోయింది అని చెబుతున్నారు. ఈ నెల చివరి నుంచి ప్రశాంత్ నీల్ తో రూపొందే డ్రాగన్ చిత్రీకరణలో పాల్గొంటాడు. ప్రస్తుతం ఈ మూవీ బెంగళూరులో జరుగుతోంది. అక్కడి నుంచి జాయిన్ అవుతాడు ఎన్టీఆర్. ఆపై తమిళ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ తో సినిమా ఉంటుంది.
ఇక ప్రశాంత్ నీల్ మూవీని చాలా రోజుల క్రితమే 2026 జనవరి 9న విడుదల చేస్తాం అని ప్రకటించారు. అయితే ఆ డేట్ కు రావడం కుదరకపోవచ్చు అనే ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ 2026 సమ్మర్ కు వెళుతుందంటున్నారు. బట్ తాజాగా ఈ చిత్ర నిర్మాతలు అదేం లేదని చెప్పారు. చెప్పిన డేట్ కు జనవరి 9నే డ్రాగన్ విడుదలవతుందని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకూ ఉన్న ప్లానింగ్ లో ఎలాంటి మార్పూ లేదన్నారు. సో.. వచ్చే యేడాది సంక్రాంతి చాలా అంటే చాలా రసవత్తరంగా ఉండబోతోందని చెప్పొచ్చు.