NTR Fan Death : 'దేవర' చూస్తూ తారక్ అభిమాని మృతి

Update: 2024-09-27 08:30 GMT

దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ విడుదలైంది. హిట్ టాక్ రావడంతో తారక్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. అత్యుత్సాహం ఒకరి ప్రాణం తీసింది.

థియేటర్లో డ్యాన్స్ చేస్తూ మస్తాన్ వలీ అనే అభిమాని ఒక్కసారిగా కుప్పకూలాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు వల్లే మస్తాన్ వలీ మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతుడు కడప జిల్లా సీకే దిన్నె మండలం జమాపల్లికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు.

Tags:    

Similar News