Kamal Haasan: కేరళకు మీరెప్పుడూ అండగా ఉన్నారు.. కమల్ బర్త్‌డే పోస్ట్‌లో పినరయి విజయన్..
Kamal Haasan: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమల్లో ఎంతోమంది గొప్ప గొప్ప నటులు ఉన్నారు.;
Kamal Haasan (tv5news.in)
Kamal Haasan: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమల్లో ఎంతోమంది గొప్ప గొప్ప నటులు ఉన్నారు. వారి నటనతో సినీ పరిశ్రమను భాషా పరిధిని దాటి ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్తున్న వారు ఉన్నారు. అలా భారత సినిమాను తన నటనతో ఎంతోమందికి చేరువ చేసిన నటులలో ఒకరు కమల్ హాసన్. కోలీవుడ్ స్థాయిని పెంచిన హీరో ఎవరు అని అడిగితే తమిళ ప్రేక్షకులు చాలామంది నిమిషం కూడా ఆలోచించకుండా చెప్పే పేరు కమల్ హాసన్. అలాంటి నటుడు ఈరోజు తన 67వ ఏట అడుగుపెట్టనున్నాడు.
కమల్ హాసన్ ప్రేక్షకులకే కాదు.. తన సహనటులకు కూడా చాలా ఇష్టమైన వ్యక్తి. వయసుతో సంబంధం లేకుండా సెట్స్‌లో అందరినీ ఉత్సాహంగా పలకరించే మనస్తత్వం ఆయనది. కమల్ హాసన్ బర్త్‌డే సందర్భంగా నటుడు ఫాహద్ ఫాజిల్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. సెట్‌లోని యంగ్ బాయ్‌కు హ్యాపీ బర్త్‌డే అంటూ కమల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఫాహద్. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విక్రమ్' సినిమాలో వీరిద్దరు కలిసి నటిస్తున్నారు. కమల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ను కూడా విడుదల చేసింది మూవీ టీమ్.
ఫాహద్ ఫాజిల్‌తో పాటు ఇంకా చాలామంది నటీనటులు కమల్ హాసన్‌కు బర్త్‌డే విషెస్‌ను తెలియజేశారు. ఆయన కూతుళ్లు అక్షర హాసన్, శృతి హాసన్ కూడా కమల్ తమ ఇన్స్‌పిరేషన్ అంటూ తమ చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్‌కు వేలకు వేల లైకులు వచ్చి పడుతున్నాయి.
సినిమా సెలబ్రిటీలు మాత్రమే కాదు.. రాజకీయ నాయకులు కూడా కమల్ హాసన్‌కు విషెస్ తెలియజేస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ట్విటర్ ద్వారా కమల్‌కు బర్త్‌డే విషెస్ చెప్పారు. 'ప్రతీ అవసరంలో మీరు కేరళకు అండగా నిలబడ్డారు. సినిమాకు, కల్చర్‌కు మీరు చేస్తున్న సేవ మరువలేనిది' అని ఆయన ఫోటోను షేర్ చేశారు.
Hearty birthday wishes dear @ikamalhaasan. You have always stood by Kerala in our every need. We are proud of your precious contributions to our cinema and culture. I wish you more happiness and success in your life and career. pic.twitter.com/k0wUg0SJc2
— Pinarayi Vijayan (@vijayanpinarayi) November 7, 2021