Mokshagna : మోక్షజ్ఞ విషయంలో బాలయ్య స్ట్రాటజీ ఏంటీ..?

Update: 2024-12-02 04:00 GMT

ఎలాంటి హీరో అయినా మాస్ హీరో అనిపించుకుంటేనే మనుగడ ఎక్కువ కాలం ఉంటుంది. వాళ్లు ఎలా మొదలైనా.. కోరుకునేది మాత్రం మాస్ అభిమానాన్నే. అలాగని ఇది అందరికీ అంత ఈజీగా సాధ్యం అయ్యే విషయం కాదు. కొందరు ఎంత ప్రయత్నించినా సాధించలేరు. కొందరికి పెద్ద కష్టపడకుండానే వచ్చేస్తుంది. అది కటౌట్ వల్లా.. కథల వల్లా అనేది ఆడియన్స్ తేల్చే మేటర్. అయితే ఆల్రెడీ మాస్ హీరోగా ఐదు దశాబ్దాలుగా బాక్సాఫీస్ ను అదరగొడుతూ గాడ్ ఆఫ్ మాసెస్ అనిపించుకున్న నందమూరి బాలకృష్ణ వారసుడి తెరంగేట్రం అంటే ఎలా ఉండాలి. మాస్ కా బాప్ అని కాకపోయినా.. మాస్ హీరో కాగలడు అనిపించుకునేలా ఉండాలి కదా. బట్ తన వారసుడి విషయంలో బాలయ్య స్ట్రాటజీ కొత్తగా కనిపిస్తోంది.

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రశాంత్.. మోక్షజ్ఞను అంత మాస్ గా చూపిస్తాడు అనుకోలేం. అతను ఇప్పటి వరకూ చేసినవన్నీ మాగ్జిమం సెన్సిబుల్ మూవీస్ మాత్రమే. హను మాన్ ను మాస్ అనడానికి లేదు. అది సూపర్ హీరో సినిమా. వెనక హనుమంతుడు ఉన్నాడనే భావన ప్రేక్షకుల్లో ఉంది కాబట్టి అది హీరోకు ఆపాదించలేదెవ్వరు. చేస్తున్నది ఎవరైనా చేయిస్తున్నది హనుమంతుడే అనుకున్నారు. అలాంటి ప్రశాంత్ .. బాలయ్య వారసుడిని మాస్ హీరోలా ప్రెజెంట్ చేస్తాడా అంటే ఖచ్చితంగా చెప్పలేము.

ఇక తర్వాతి మూవీ అయినా అలా ఉందా అంటే లేదు. ప్రశాంత్ కంటే సాఫ్ట్ మూవీస్ తో నెట్టుకు వస్తోన్న వెంకీ అట్లూరి డైరెక్షన్ లో మోక్షజ్ఞ సెకండ్ మూవీ కన్ఫార్మ్ అయింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందబోతోన్న సినిమా ఇది. అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా అయినట్టే. వెంకీ అట్లూరి ముందు నుంచి సాఫ్ట్ మూవీస్ మాత్రమే చేస్తున్నాడు. అతని రైటింగ్ చూసినా మాస్ యాంగిల్ కనిపించదు. అలాంటి దర్శకుడితో రెండో సినిమా అంటే మోక్షజ్ఞను కూడా సాఫ్ట్ స్టార్ గా మార్చాలనుకుంటున్నాడా బాలయ్య అనిపించక మానదు.

అయితే బాలయ్య కెరీర్ ఆరంభాన్ని కూడా ఇలాగే ప్లాన్ చేశాడు ఎన్టీఆర్. ముందు సాఫ్ట్ మూవీస్ తోనే సత్తా చాటే ప్రయత్నం చేశాడు. మంగమ్మ గారి మనవడు తర్వాత మాస్ ఆడియన్స్ వైపు వచ్చాడు బాలయ్య. అలాగే తనయుడినీ పరిచయం చేయాలనుకుంటున్నాడా లేక ఇంకేదైనా కొత్త స్ట్రాటజీ ఉందా అనేది చెప్పలేం కానీ.. ఇప్పుడున్న పోటీలో ఇలాంటి సాఫ్ట్ డైరెక్టర్స్ తో మాస్ ఇమేజ్ రావడం అంత సులువు కాదు. లేట్ అయితే అసలుకే మోసం కూడా వస్తుంది. ఒకవేళ కుర్రాడి లుక్ ఇంకా అప్పుడే మాస్ స్టోరీస్ కు యాప్ట్ కాదు అనుకోవడానికి కూడా లేదు. కథలు కరెక్ట్ గా పడితే కటౌట్ అదే అలవాటు పడిపోతుందంటారు కదా. ఆ దిశగా కూడా ఆలోచిస్తే బెటరేమో. 

Tags:    

Similar News