Kaushik LM : 36 ఏళ్లకే మృతి చెందిన ఫిల్మీ క్రిటిక్.. కార్డియాక్ అరెస్ట్‌తో కౌశిక్..

సినీ విమర్శకుడు మరియు ట్రేడ్ అనలిస్ట్ కౌశిక్ LM సోమవారం, ఆగస్టు 15న గుండెపోటుతో మరణించారు.

Update: 2022-08-16 08:00 GMT

Kaushik LM : సినీ విమర్శకుడు మరియు ట్రేడ్ అనలిస్ట్ కౌశిక్ LM సోమవారం, ఆగస్టు 15న గుండెపోటుతో మరణించారు. అతను ప్రసిద్ధ ఎంటర్‌టైన్‌మెంట్ ట్రాకర్, ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబ్ వీడియో జాకీ మరియు ఫిల్మ్ రివ్యూయర్. ఆయన హఠాన్మరణం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. అతని వయసు కేవలం 36. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, కీర్తి సురేష్, ధనుష్, రష్మిక మందన్న, వెంకట్ ప్రభు, హరీష్ కళ్యాణ్ మరియు ఇతరులతో సహా టాలీవుడ్ మరియు కోలీవుడ్‌కు చెందిన ప్రముఖులు కౌశిక్ ఎల్ఎమ్' మృతి పట్ల సంతాపం తెలిపారు.

కీర్తి సురేష్: ఈ వార్త వింటే నాకు మాటలు రావడం లేదు. ఇది నమ్మశక్యం కాదు!! అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. కౌశిక్.. ఇక నువ్వు లేవు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను.

రష్మిక మందన్న: ఇది విన్నందుకు నేను చాలా చింతిస్తున్నాను.. ఇది నిజంగా హృదయ విదారకంగా ఉంది.. అతను ఎంతో మంచి వ్యక్తి.

విజయ్ దేవరకొండ: నీ గురించి ఆలోచిస్తూ ప్రార్థన చేస్తున్నా. మీ ఆత్మకు శాంతి కలగాలి. మీరు లేరు అన్న వార్తను జీర్ణించుకోవడం కష్టం.

సీతా రామం ఫేమ్ దుల్కర్ సల్మాన్: కౌశిక్ ఎల్ఎమ్ ఇది నిజంగా హృదయ విదారకంగా ఉంది. ఇది నిజం కాకూడదని నేను కోరుకుంటున్నాను. మీ కుటుంబం మీరు లేరు, ఇక తిరిగి రారు అన్న నిజం తెలిసి ఎంత బాధపడుతుందో.. కౌశిక్ LM వ్యక్తికగతంగా అప్పుడప్పుడూ అయితే ట్వి్ట్టర్ ద్వారా ఎప్పుడూ టచ్ లోనే ఉండేవారు. మీరు ఎల్లప్పుడూ నాకు చాలా ప్రేమ మరియు మద్దతు చూపించేవారు. జీవితం చాలా చిన్నది. మీ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా బ్రదర్. మంచి సినిమాకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ ప్రోత్సాహించిన మీకు ధన్యవాదాలు. నేను నా మనసులోని బాధను సరిగ్గా చెప్పలేకపోతున్నాను. ఇది నాకు వ్యక్తిగతంగా చాలా బాధపెడుతున్న విషయం. నన్ను క్షమించండి అని దుల్కర్ ట్వీట్ చేశారు. 

Tags:    

Similar News