Pooja Hegde : ఫైనల్ గా తెలుగు ఆఫర్ పట్టేసిన పూజాహెగ్డే

Update: 2025-07-10 12:00 GMT

రెండు మూడేళ్ల క్రితం టాలీవుడ్ టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవరూ అంటే అంతా పూజాహెడ్గే వైపు చూపించారు. కానీ సడెన్ గా తను డౌన్ అయింది. ఒక్క తెలుగు సినిమా అనుకునే స్టేజ్ కు పడిపోయింది. ఇక తెలుగులో తన పని అయిపోయినట్టే అనుకున్నారు. అఫ్ కోర్స్ తెలుగులో ఆఫర్స్ లేవు కానీ.. తమిళ్ లో దూసుకుపోతోంది. హిందీలో బానే మెప్పిస్తోంది. బట్ తనకు స్టార్డమ్ వచ్చిందే తెలుగు మార్కెట్ నుంచి కదా. అక్కడ సినిమా లేదు అంటే కొంత అవమానం అనే చెప్పాలి. అందుకోసం అనేక ప్రయత్నాలు చేసిన ఈ జిగేల్ రాణి ఫైనల్ గా తెలుగు ఆఫర్ పట్టేసింది. అది కూడా అనౌన్స్ మెంట్ కు ముందే ప్రామిసింగ్ అనిపించే సినిమా కావడం విశేషం.

కొన్నాళ్లుగా కేవలం సొంత భాషలోనే కాక కథ నచ్చితే ఏ భాషలో అయినా సినిమాలు చేస్తూ అదరగొడుతున్నాడు దుల్కర్ సల్మాన్. అలాంటి దుల్కర్ సల్మాన్ సరసనే ఆఫర్ కొట్టేసింది పూజా హెగ్డే. మొన్నటి వరకూ ఇదో రూమర్ గానే భావించారు చాలామంది. బట్ ఫైనల్ గా తనే హీరోయిన్. ఎస్.వి.ఎల్.సి బ్యానర్ లో రూపొందే ఈ చిత్రాన్ని రవి అనే కొత్త దర్శకుడు రూపొందించబోతున్నాడు. ఇతను ఇంతకు ముందు దర్శకుడు పరశురామ్ వద్ద అసిస్టెంట్ గా పనిచేశాడు. సో.. ఈ బ్యానర్ లో దుల్కర్, పూజాహెగ్డే జంటగా ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపొందబోతోంది. 

Tags:    

Similar News