ఇప్పటి వరకూ సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్ గానే గుర్తింపు తెచ్చుకున్నాడు శేఖర్ కమ్ముల. చాలా వరకూ కొత్త కుర్రాళ్లతోనే సినిమాలు చేశాడు. పెద్ద స్టార్స్ ఎవరూ అతని సినిమాల్లో కనిపించలేదు. ఫస్ట్ టైమ్ కుబేరతో నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన ధనుష్ తో పాటు కింగ్ నాగార్జున, రష్మిక మందన్నా వంటి స్టార్స్ తో కుబేర మూవీ చేస్తున్నాడు. చాలాకాలంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడంలో టీమ్ ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతూనే ఉంది. ప్రధాన పాత్రల పరిచయ వీడియోలు ఆకట్టుకున్నా.. గ్లింప్స్ అంటూ రిలీజ్ చేసిన వీడియో ఎవరికీ అర్థం కాలేదు.
కొన్ని రోజులుగా కుబేర టైటిల్ విషయంలో కొన్ని వివాదాలు కనిపిస్తున్నాయి. వాటి విషయంలోనూ మూవీ టీమ్ ఇప్పటి వరకూ పెద్దగా రెస్పాండ్ కాలేదు. దీంతో అసలేం జరుగుతుందా అనుకుంటున్న వారికి సడెన్ గా రిలీజ్ డేట్ అంటూ కొత్త పోస్టర్ కనిపించింది. జూన్ 20న తమ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. నిజానికి గత యేడాది డిసెంబర్ లోనే రిలీజ్ అనే టాక్ వినిపించింది. బట్ ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడమా లేక శేఖర్ కమ్ముల ఎప్పట్లానే బద్ధకంగా చిత్రీకరించాడా అనేది తెలియదు కానీ ఈ మూవీ స్టార్ట్ అయిన తర్వాతే ధనుష్ నుంచి దర్శకుడుగా రెండు, హీరోగా రెండు సినిమాలు విడుదలయ్యాయి అంటే ఆశ్చర్యం కలగక మానదు. బట్ ఎంత లేట్ అయినా ఇదో స్పెషల్ మూవీగా నిలుస్తుందనే నమ్మకం మాత్రం అందర్లోనూ ఉంది. అందుకు కారణం శేఖర్ కమ్ముల. సో ఫైనల్ గా కుబేర జూన్ 20న రిలీజ్ కాబోతోందన్నమాట.