Pawn Kalyan : మాట వినాలి అంటున్న హరిహర వీరమల్లు

Update: 2025-01-04 11:15 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న సినిమా హరిహర వీరమల్లు. జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఏఎమ్ రత్నం నిర్మిస్తోన్న హరిహర వీరమల్లు పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో పవన్ కళ్యాణ్ ఓ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. అంటే ఔరంగజేబు నాటి కాలంలో ఈ కథ సాగుతుందని ముందే చెప్పారు. అందుకోసం ఎంచుకున్న పాత్రలే కాదు.. సెట్స్ కూడా అదిరిపోయాయని ఇప్పటి వరకూ వచ్చిన స్టిల్స్ చూస్తే తెలుస్తుంది. అయితే ఈ చిత్రం మార్చి 28న విడుదల కావడం కష్టమే అనుకుంటోన్న టైమ్ లో సడెన్ గా ఫస్ట్ సాంగ్ ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది మూవీ టీమ్. ఎమ్ఎమ్ కీరవాణి ఈ మూవీకి మ్యూజిక్ చేస్తున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఓ వారం రోజుల పాటు పవన్ కళ్యాణ్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. త్వరలోనే ఆయన డేట్స్ ఇచ్చి సినిమా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు సాంగ్ అప్డేట్ కూడా వచ్చింది కాబట్టి ఇక హరిహర వీరమల్లు మార్చి 28న రావడం పక్కా అనుకోవాలి. మొదట ఒకే పార్ట్ గా మొదలైన ఈ మూవీ ఇప్పుడు రెండు భాగాలుగా మారింది. ఫస్ట్ పార్ట్ నే మార్చిలో విడుదల చేస్తారు. మరి సెకండ్ పార్ట్ సంగతేంటో కానీ.. పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు ఎక్కువగా ‘ఓ.జి’ మూడ్ లో ఉన్నారు. అయినా హరిహర వీరమల్లు వస్తోందంటే వారిలో తెలియని ఉత్సాహం కనిపిస్తుంది.

సాంగ్ కు సంబంధించిన అప్డేట్ ను తెలియజేస్తూ విడుదల చేసిన పవన్ కళ్యాణ్ స్టిల్ ఆకట్టుకుంటోంది. ఓ వెన్నెల రాత్రి చలిలో వెచ్చని మంట ముందు కంజీరా( డప్పు లాంటిది) ను వాయిస్తూ ఆనందంతో ఉన్న పవన్ స్టిల్ ఇది. ఇక పాట పేరు ‘చెబితే వినాలి’ అట. ప్యాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో ఉంటుందీ పాట. సోమవారం ఉదయం 9 .06 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తోన్న పాట కాబట్టి ఈ సాంగ్ రికార్డులు కొడుతుందని చెప్పొచ్చు. 

ఇక ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, నోరా ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్తా, పూజిత పొన్నాడ కీలక పాత్రలు చేస్తున్నారు. 

Tags:    

Similar News