తెలుగు సినిమా చరిత్రలో అత్యంత అరుదైన సినిమాగా ‘మనం’ నిలిచిపోతుంది. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల నటులు కలిసి నటించిన సినిమాగా ఇది ఎవర్ గ్రీన్ స్థానం సొంతం చేసుకుంది. లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమాగా వచ్చినా.. బలమైన కథ, ఎమోషన్స్ తో అద్భుతమైన విజయాన్నీ సొంతం చేసుకుంది మనం. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో తండ్రి, కొడుకు, మనవడు కలిసి వేర్వేరు బంధాలు, వరసలతో కనిపించడం విశేషం. ఇక ఈమూవీలో సమంతను పెళ్లి చేసుకున్న చైతన్య నిజ జీవితంలోనూ పెళ్లాడాడు. ప్రస్తుతం ఏంటీ అనేది అప్రస్తుతం. అలాగే చివర్లో అక్కినేని అఖిల్ కూడా గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వడంతో సంపూర్ణం అయింది.
ఇప్పుడు ఈ చిత్రాన్ని జపాన్ లో విడుదల చేయడటం విశేషం. ఈ రోజు(ఆగస్ట్ 8) నుంచే మనం జపాన్ లో ప్రదర్శితం అవుతుంది. తెలుగులోనే ఉన్నా.. జపనీస్ సబ్ టైటిల్స్ తో సినిమా ఉంటుంది. సినిమా ప్రదర్శన జరగుతున్న టైమ్ లో నాగార్జున, చైతన్య అక్కడి ప్రేక్షకులతో జూమ్ లో ఇంటరాక్ట్ అవుతారట. సో.. ఈ ఎపిక్ మూవీ వారికి కూడా కనెక్ట్ అయితే అక్కినేని ఫ్యామిలీకీ కొత్త మార్కెట్ క్రియేట్ అవుతుందని చెప్పొచ్చు.