తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అవార్డ్స్ విషయంలో మాట నిలబెట్టుకుంది. విప్లవ, సినీ రచయిత, గాయకుడు గద్దర్ మరణానంతరం ఆయన పేరుతో నంది అవార్డ్స్ తరహాలో ప్రభుత్వం నుంచి అవార్డులు అందిస్తాం అని చెప్పింది. మొదట ఈ నిర్ణయానికి స్పందన రాలేదు. ముఖ్యంగా గద్దర్ పేరుతో అవార్డ్ అన్నప్పుడు ఇండస్ట్రీ కాస్త చిన్న చూపు చూసింది. ఓ సందర్భంలో రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఆవేదన వెలిబుచ్చడం.. చిరంజీవి రియాక్ట్ అయ్యి కమిటీని సిఫార్స్ చేయడం.. ఆ తర్వాత ఓ జ్యూరీని ఏర్పాటు చేసి అవార్డ్స్ కు అర్హమైన సినిమాలను ఎంపిక చేయడం చకచకా జరిగిపోయింది. జ్యూరీ చైర్‌పర్సన్ గా జయసుధ ఆధ్వర్యంలో ఇవాళ ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్’ను ప్రకటించారు.
ఈ అవార్డ్స్ లో ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ‘కల్కి ఏ.డి2898’చిత్రం ఎంపికైంది. సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా పొట్టేల్, థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా లక్కీ భాస్కర్ లు అవార్డ్స్ గెలుచుకున్నాయి. ఇక జాతీయ సమగ్రత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతి విభాగాల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం అవార్డ్ గెలుచుకుంది. ఉత్తమ నటుడుగా పుష్ప ౨ చిత్రానికి అల్లు అర్జున్, ఉత్తమ నటిగా ౩౫ చిన్న కథ కాదు చిత్రానికి నివేదా థామస్ అవార్డ్ లు గెలుచుకున్నారు.
ఇక అవార్డులు గెలుచుకున్న వారి లిస్ట్ ఇది.
గద్దర్ అవార్డులు
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2024 ప్రకటన
ఉత్తమ మొదటి చిత్రం కల్కి
ఉత్తమ రెండో చిత్రం పొట్టేల్
ఉత్తమ మూడో చిత్రం లక్కీ భాస్కర్
ఉత్తమ బాలల చిత్రం-35 ఇది చిన్న కథ కాదు
ఉత్తమ ఫీచర్ హెరిటేజ్ అవార్డు-రజాకార్
ఉత్తమ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప-2)
ఉత్తమ దర్శకుడు - నాగ్ అశ్విన్ (కల్కి)
ఉత్తమ నటి - నివేదా థామస్ (35 ఇది చిన్న కథ కాదు)
ఉత్తమ గాయని - శ్రేయా ఘోషల్ (పుష్ప-2)
ఉత్తమ స్క్రీన్ ప్లే-వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ హాస్యనటులు - వెన్నెల కిషోర్, సత్య (మత్తు వదలరా 2)
ఉత్తమ కొరియోగ్రాఫర్ - గణేష్ ఆచార్య (దేవర)
ఉత్తమ కథా రచయిత - శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
ఉత్తమ పుస్తకం - రెంటాల జయదేవ్ (మన సినిమా పుస్తకం)
ఉత్తమ గేయరచయిత - చంద్రబోస్ ( రాజు యాదవ్)
బెస్ట్ సినిమాటోగ్రఫీ - శ్రీ విశ్వనాథ్ రెడ్డి ( గామి)
స్పెషల్ జ్యూరీ అవార్డు - అనన్య నాగళ్ల (పొట్టేల్)
స్పెషల్ జ్యూరీ - దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
స్పెషల్ జ్యూరీ - ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా-2)
తదితరులు వివిధ విభాగాల్లో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ ను గెలుచుకున్నారు. విజేతలందరికీ జూన్ 14న హైటెక్స్‌లో అవార్డుల ప్రదానం చేయనున్నట్టు జ్యూరీ సభ్యులు తెలియజేశారు. ఇక 2014 -2023 సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను కూడా త్వరలోనే ప్రకటిస్టామని తెలిపింది జ్యూరీ చైర్‌పర్సన్ గా జయసుధ