గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎస్ జె సూర్య, శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర, సునీల్, ప్రియదర్శి, సత్య తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ దసరాకు వస్తుంది అంటూ తమన్ అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ అది కష్టమే అని మరో అప్డేట్ ఇచ్చాడు తమన్. "దసరాకు టీజర్ రాకపోతే డిజప్పాయింట్ అవ్వకండి. టీమ్ అంతా సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. కానీ ఇదే నెలలో మూడో సాంగ్ ఖచ్చితంగా వస్తుంది" అంటూ రామసుకొచ్చాడు. దాంతో మెగా ఫ్యాన్స్ కి మరోసారి నిరాశే ఎదురయ్యింది. ఇక గేమ్ ఛేంజర్ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల కానుంది.