Garima Jain: పబ్‌లో నటి ఫోన్ మాయం.. పోలీసులకు ఫిర్యాదు..
Garima Jain: బుల్లితెరపై కెరీర్‌ను ప్రారంభించి మెల్లగా వెండితెరపై కూడా స్థానం సంపాదించుకుంది నటి గరిమా జైన్.;
Garima Jain (tv5news.in)
Garima Jain: ఈమధ్య సిటీల్లో పబ్ కల్చర్ బాగా పెరిగిపోయింది. ఏ వృత్తిలో ఉన్నవారు అయినా వీకెండ్ వస్తే చాలు.. పబ్‌కుు వెళ్లడం కామన్ అయిపోయింది. ఇదే అదునుగా తీసుకొని కొందరు పబ్‌లను క్రైమ్ చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. అయితే తాజాగా ఓ నటి పబ్‌లో తన ఖరీదైన ఫోన్ పోగొట్టుకున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బుల్లితెరపై కెరీర్‌ను ప్రారంభించి మెల్లగా వెండితెరపై కూడా స్థానం సంపాదించుకుంది బాలీవుడ్ నటి గరిమా జైన్. సీరియల్స్‌లో, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ ప్రస్తుతం తన కెరీర్‌ను ఫార్మ్‌లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది గరిమా. తాజాగా తను ముంబాయి ఎయిర్‌ఫోర్ట్ సమీపంలోని ఓ పబ్‌కు వెళ్లింది. అక్కడే తన రూ. 1 లక్ష విలువైన ఫోన్ పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది గరిమా. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.