విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న మూడో సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ మూవీపై ముందు నుంచీ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అందుకు ఫస్ట్ రీజన్ మ్యూజిక్ అంటే అతిశయోక్తి కాదు. మొన్నటి వరకూ లైమ్ లైట్ లోనే లేని భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్ కు ఇంటర్నెట్ షేక్ అవుతోంది. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అని చెప్పుకుంటోన్న దేవీ శ్రీ ప్రసాద్, థమన్ ల మ్యూజిక్ ను కూడా దాటేసి అతను కంపోజ్ చేసిన సాంగ్ ఈ యేడాది టాప్ ప్లేస్ లో ఉంది. అందుకు వెటరన్ మ్యూజిషియన్ కమ్ సింగర్ రమణ గోగుల కూడా ఓ రీజన్ అని చెప్పాలి.. ఒప్పుకోవాలి.
ఈ మధ్య కాలంలో వచ్చిన సాంగ్స్ లో హయ్యొస్ట్ వ్యూస్ తో సంక్రాంతికి వస్తున్నాం నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ ‘గోదారి గట్టు మీద రామ సిలకవే’ 51 మిలియన్ వ్యూస్ తో టాప్ ప్లేస్ లో ఉంది. దీనికంటే చాలా ముందుగానే విడుదలైన గేమ్ ఛేంజర్ సాంగ్ 50 మిలియన్ వ్యూస్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది. గేమ్ ఛేంజర్ నుంచే వచ్చిన నానా హైరానా సాంగ్ 45 మిలియన్ వ్యూస్ తో కనిపిస్తోంది. అలాగే రా మచ్చా సాంగ్ 41 మిలియన్ వ్యూస్, ధోప్ 25.5 మిలియన్ వ్యూస్ తో కనిపిస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం నుంచి వచ్చిన సెకండ్ సాంగ్ మీనూ 11.8 మిలియన్ వ్యూస్ తో నిలిచింది. నందమూరి బాలకృష్ణ డాకూ మహరాజ్ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ రేజ్ ఆఫ్ డాకూ 3 మిలియన్ వ్యూస్, చిన్ని సాంగ్ 2.4 మిలియన్ వ్యూస్ తో నిలిచింది.
విశేషం ఏంటంటే.. గోదారి గట్టు మీద సాంగ్ ఇంకా చాలా మిలియన్ వ్యూస్ సాధించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ పాటతో సినిమా రేంజే మారిపోయిందంటే అతిశయోక్తి కాదు.
నిజానికి భీమ్స్ ను చిన్న సినిమాల సంగీత దర్శకుడుగానే చూశారు చాలామంది. కానీ మాస్ మహరాజ్ రవితేజ తన ధమాకా మూవీకి ఆఫర్ ఇచ్చాడు. ఆ ఛాన్స్ ను అద్భుతంగా వాడుకున్న భీమ్స్ అప్పటి నుంచి అన్నీ బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇస్తున్నాడు. ఇవన్నీ క్లాస్ తో పాటు మాస్ ను కూడా ఊపేస్తుండటం విశేషం.