Good Bye Movie : 'గుడ్ బై' ట్రైలర్ విడుదల.. చావుకి కొత్త డెఫినిషన్..
Good Bye Movie : రష్మిక తొలి బాలువుడ్ సినిమా ‘గుడ్ బై’ ట్రైలర్ రిలీజ్ అయింది;
Good Bye Movie : రష్మిక తొలి బాలీవుడ్ సినిమా 'గుడ్ బై' ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో ఆమె అమితాబ్ బచ్చన్ కూరురిగా నటిస్తోంది. సినిమా మొత్తం ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. పుట్టిన రోజును ఎలాగైతే వేడుకగా జరుపుకుంటారో అలాగే చావును కూడా సెలబ్రేట్ చేసుకోవాలనే కాన్సెప్ట్‌తో వికాస్ బహల్ ఈ మూవీని తెరకెక్కించారు.
తండ్రిపైన ఆధారపడకుండా విదేశాల్లో జీవించే పాత్రలో రష్మిక నటిస్తుంది. అయితే అది అవమానంగా భావించే తండ్రి పాత్రలో అమితాబ్ నటిస్తారు. తన భార్య చనిపోతే విదేశాల్లో ఉన్న కొడుకు కూతుళ్లకు చెప్పినప్పుడు వాళ్లు రకరకాల కారణాల చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఇలా ఎన్నో ఎమోషన్ సీన్స్ ట్రైలర్‌లో చూపించారు మేకర్స్. అక్టోబర్ 7న థియేటర్లో ఈ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది.