Rajasaab-2 : డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలోనే రాజాసాబ్- 2

Update: 2025-08-07 15:00 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి కాంబోలో వస్తున్న చిత్రం 'ది రాజాసాబ్ '. బిగ్గెస్ట్ హారర్ ఫాంటసీ ఫిల్మ్ ఇది సిద్దమవుతోంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా.. సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా రాజాసాబ్ డిసెంబర్ 5న విడుదలవుతుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ది రాజాసాబ్' సంక్రాంతికి వస్తే బాగుంటుందని తెలుగు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ, హిందీ ఆడియన్స్ మాత్రం డిసెంబర్ 5న విడుదల చేయాలని బలంగా కోరుతున్నారు. ఈ విషయమై ఆలోచిస్తున్నం. అక్టోబర్ చివరి నాటికి ఈ సినిమా అంతా పూర్తవుతుంది. కొన్ని పాటలు షూట్ చేయాలంతే. రఫుటేజ్ ఏకంగా 4.30 గంటల పాటు వచ్చింది. దాన్ని ఎడిట్ చేసి కుదించాలి. ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమాలో వీఎఫ్ఎక్స్ చాలా బాగా వచ్చింది. మాస్, క్లాస్ అన్నివర్గాల వారిని కచ్చితంగా అలరిస్తుంది. త్వరలో నే 'రాజాసాబ్ 2' కూడా ఉంటుంది. కాకపోతే అది కొనసాగింపు లేదా సీక్వెల్లా ఉండదు. కొత్త స్టోరీతో డిఫరెంట్ యూనివర్స్ సృష్టిస్తం' అని చెప్పు కొచ్చాడు. ఇక ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అం దిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో టీజీ విశ్వప్రసాద్ నిర్మాణం వహిస్తున్నారు.

Tags:    

Similar News