యాంగ్రీమేన్ గా తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్నాడు గోపీచంద్. చేసిన సినిమాలతో తనుగా ఏ ప్రయత్నాలు చేయకుండానే మాస్ లో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ కూడా స్టార్ట్ అయింది. అలాంటి తను ఎక్కడో గాడి తప్పాడు. కొన్నేళ్లుగా గోపీచంద్ సినిమా అంటే ఫ్లాప్ అనేంతగా సిట్యుయేషన్ మారిపోయింది. ఇన్ని ఫ్లాపులు వస్తున్నా అతను కథలు మార్చలేదు. తనూ మారలేదు. రొటీన్ కంటెంట్ కే ఎక్కువ శాతం ప్రిఫరెన్స్ ఇస్తూ వచ్చాడు. 2015లో వచ్చిన జిల్ అతని చివరి హిట్ అంటే ఆశ్చర్యం కలగక మానదు. మధ్యలో వచ్చిన సీటీమార్ కమర్షియల్ గా ఓకే అనిపించుకుంది కానీ అంత గొప్ప మూవీ ఏం కాదు. చివరగా వచ్చిన భీమా, విశ్వం సినిమాలు అసలు ఎందుకు చేశాడో కూడా ఎవరికీ అర్థం కాలేదు.
ఫైనల్ గా అందరూ ఆఁ.. ఇది కదా గోపీచంద్ నుంచి ఎదురు చూస్తున్నది అనే కాంబినేషన్ సెట్ చేశాడు. రొటీన్ డైరెక్టర్స్ తో కాకుండా ఈ సారి సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో సినిమాకు కమిట్ అయ్యాడు. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తోన్న సినిమా ఇది. దీంతో పాటు యూవీ క్రియేషన్స్ లో మరో ప్రాజెక్ట్ ఓకే అయింది కానీ.. సంకల్ప్ సినిమా అంటే వచ్చే కిక్ మరే ప్రాజెక్ట్ కూ రాదేమో.
ఘాజీ అనే మూవీతో కంట్రీ మొత్తాన్ని మెస్మరైజ్ చేశాడు సంకల్ప్. అత్యంత పరిమితమైన బడ్జెట్ తో అపరిమితమైన కంటెంట్ అందించాడు. తర్వాత చేసిన అంతరిక్షం కమర్షియల్ గా ఓకే కాకపోయినా అతని నెరేషన్ బావుంటుంది. ఆ మధ్య హిందీలో విద్యుత్ హీరోగా ఓ సినిమా చేశాడు. ఇది ఆకట్టుకోలేదు. అయినా సంకల్ప్ ను ఈజీగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ మూవీ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో 7వ శతాబ్దంలో సాగే కథట. ఈ తరహా కథ గోపీచంద్ కూ ఫస్ట్ టైమ్. కొన్నాళ్ల క్రితం సాహసం అనే అడ్వెంచరస్ మూవీతో హిట్ కొట్టాడు. మరి ఈ హిస్టారికల్ ఫిల్మ్ తోనూ కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ అందుకుని స్ట్రాంగ్ కబ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.