హీరో కృష్ణ గారి అల్లుడుగా, మహేష్ బాబు బావగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు సుధీర్ బాబు. అయితే తనదైన శైలిలో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లోనే ఉన్నాడు. ఈ క్రమంలో కొన్ని హిట్స్ వచ్చినా.. రేంజ్ పెరగలేదు. తనకంటూ సెపరేట్ ఇమేజ్ బిల్డ్ కాలేదు. ఎప్పటికప్పుడు కొత్త కథలు ట్రై చేస్తూనే ఉన్నాడు కానీ.. కథన లోపం, దర్శకత్వం లోపం వంటి కారణాలతో విజయాలు రావడం లేదు. రీసెంట్ గా వచ్చిన హరోం హర నేపథ్యం కొత్తగా ఉంది. బట్ స్క్రీన్ ప్లే బాలేదు. దీంతో తను ఎంతో ఎగ్జైటింగ్ గా సినిమా గురించి చెప్పుకున్నా.. ఫైనల్ అవుట్ పుట్ మాత్రం ఫ్లాప్.
ఆలస్యంగా ఇండస్ట్రీకి వచ్చినా.. మహేష్ కు లేనిది సుధీర్ కు ఉన్నది ఏంటంటే.. కండలు, డ్యాన్సులు. ఈ రెండు విషయాల్లో స్ట్రాంగ్ గా ఉన్నాడు. కానీ కథల విషయంలో మాత్రం ఇంకా స్ట్రాంగ్ కాలేకపోతున్నాడు. సమ్మోహనం తర్వాత ఇప్పటి వరకూ సాలిడ్ హిట్ లేదు సుధీర్ బాబుకు.
లేటెస్ట్ గా అతను జిమ్ లో వర్కవుట్ చేస్తూ ఆర్నాల్డ్ స్వార్ట్జ్ నెగ్గర్ రేంజ్ లో కండల ప్రదర్శన చేస్తూ ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది చూసి కొంతమంది వావ్ అన్నా.. అయినా కథలు పెంచకుండా కండలు పెంచితే ఏం లాభం అంటూ కమెంట్స్ చేస్తున్నారు. నిజానికి హీరోలు ఫిట్ గా ఉండటం మంచిదే. కానీ మరీ ఇంత కండల గండడుగా మారాల్సిన అవసరం ఏముందో మాత్రం తెలియదు. హాలీవుడ్ లో చాలామంది యాక్షన్ హీరోలు ఇవేం లేకుండానే ఇరగదీస్తారు. ఈ మధ్య మనోళ్లే ఓవర్ ఎక్సైజ్ లు చేస్తూ కనిపిస్తున్నారు. మరి ఇవి సినిమా కోసం పెంచుతున్న కండలా లేక ప్రస్తుత ఫ్లాపులను మర్చిపోవడానికి చేస్తోన్న వర్కవు( ఫీ )ట్లా అనేది తెలియాలి.