బాలీవుడ్లో మోస్ట్ రొమాంటిక్ కపుల్ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో రణబీర్ కపూర్, ఆలియా భట్ జోడీ ఉంటుంది అనడంలో సందేహం లేదు. దేశవ్యాప్తంగా వీరిద్దరికి మంచి పాపులారిటీ ఉంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ స్టార్స్ దూసుకుపోతున్నారు. ఇక అలియా అటు ఫ్యా మిలీని చూసుకుంటూ.. ఇటు సినిమాల్లో నటిస్తూ మరోవైపు సోషల్ మీడియాలోని అభిమానులతో టచ్ లో ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ భర్త రణబీర్ తో కలిసి ఓ ఫొటో పంచుకుంది. ఈ పిక్ కు ఓ క్యాప్షన్ కూడా జోడించింది. హోం, ఎల్లప్పుడు హ్యాపీ అంటూ మూడో వార్షికోత్సవం సందర్భంగా హ్యాపీ 3 అనే హ్యాష్ ట్యాగ్ ను షేర్ చేసింది. లవ్, క్యూట్ ఈమెజీని యాడ్ చేసి తన ప్రేమను వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు రణబీర్ కపూర్ యానిమల్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. త్వరలోనే యానిమల్ పార్క్ అంటూ సీక్వెల్ తో పాటు రామాయణం సినిమాను చేస్తున్నాడు. ఇదే సమయంలో రణబీర్ కపూర్, ఆలియా భట్ కలిసి 'లవ్ అండ్ వార్' సినిమాలో నటిస్తున్నా రు. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.