పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా హరిహర వీరమల్లు. ఈ నెల 24న విడుదల కాబోతోన్న ఈ చిత్రాన్ని ఏఎమ్ రత్నం నిర్మించాడు. క్రిష్ కొంత భాగం డైరెక్ట్ చేయగా, జ్యోతికృష్ణ మిగిలింది పూర్తి చేశాడు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ను ఎదురించే యోధుడి పాత్రలో కనిపించబోతున్నాడు. హిందూ ధర్మాన్ని పరిరక్షించేందుకు నడుం కట్టిన యువకుడుగానూ ఆయన కనిపించబోతున్నాడు. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్. బాబీడియోల్, అనసూయ, పూజిత పొన్నాడ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి కీరవాణి సంగీతం అందించాడు.
ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి కొంత గందరగోళం ఉంది. మొదట తిరుపతిలో నిర్వహించాలనుకున్నారు. తర్వాత విశాఖపట్నం అని చెప్పారు. మరోసారి ఆ వేదిక మారింది. ఈ సారి హైదరాబాద్ అని చెబుతున్నారు. హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. అయితే ఈ సారి వెన్యూలో ఎలాంటి మార్పులూ ఉండవని చెబుతున్నారు. ఎందుకంటే రిలీజ్ టైమ్ కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి మళ్లీ మారిస్తే ఏర్పాట్లు చేయడం కుదరదు. సో.. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 21న హైదరాబాద్ లోనే నిర్వహించబోతున్నారు. ఇది ఫిక్స్ ట.