Harihara Veeramallu : ముందే ఓటిటికి వచ్చేస్తోన్న హరిహర వీరమల్లు

Update: 2025-08-01 09:30 GMT

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా హరి హర వీరమల్లు. క్రిష్ కొంత భాగం, జ్యోతికృష్ణ కొంత భాగం చిత్రీకరణ చేసిన ఈ మూవీ జూలై 24న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా డిక్లేర్ అయింది. విజువల్ ఎఫెక్ట్స్ పూర్ గా ఉండటమే సినిమా రిజల్ట్ బ్యాడ్ గా రావడానికి కారణం అనే మాట యూనానిమస్ గా వినిపించింది. విశేషం ఏంటంటే.. ఇది పవన్ కళ్యాణ్ ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమా కూడా. ఏ భాషలోనూ సాలిడ్ ఇంపాక్ట్ చూపించలేకపోయింది.

ఇక హరిహర వీరమల్లును ముందుగా ఆగస్ట్ 22న ఓటిటిలో విడుదల చేయాలనుకున్నారు. అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ ఓటిటి హక్కులు సొంతం చేసుకుంది. సినిమా రిజల్ట్ తేడా కొట్టడంత ఇప్పుడు కాస్త ముందుగానే ఓటిటిలో విడుదల చేయబోతున్నారు. ముందు అనుకున్నట్టుగా ఆగస్ట్ 22న కాకుండా ఆగస్ట్ 15నే ఈ మూవీ ఓటిటిలోకి రాబోతోంది. ఓ స్టార్ హీరో సినిమా ఇలా ముందుగానే ఓటిటిలోకి రావడం అంటే ఆ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఈ మూవీలో పవన్ తో పాటు నిధి అగర్వాల్, బాబీ డియోల్, దిలీప్ తాహిల్, సత్యరాజ్, రఘుబాబు, సచిన్ ఖేద్కర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. కీరవాణి సంగీతం అందించాడు. ఏఎమ్ రత్నం నిర్మాత. 

Tags:    

Similar News