తన సినిమాకు రివ్యూలు ఏమైనా రాసుకోవచ్చని, నచ్చిన రేటింగ్‌లు ఇచ్చుకోవచ్చని దర్శకుడు హరీశ్ శంకర్ సవాల్ విసిరారు. తన ఆత్మాభిమానం దెబ్బతీసిన ఇద్దరు, ముగ్గురు వ్యక్తులతో ముఖాముఖిగా గొంతెత్తినట్లు తెలిపారు. ‘ఇట్స్ టైమ్ ఫర్ గ్రాటిట్యూడ్ నాట్ ఆటిట్యూడ్’ అంటూ తనదైన శైలిలో పంచ్ డైలాగ్ వేశారు. ఆయన మాట్లాడుతుండగా.. ఓ వ్యక్తి బాగా అరుస్తుండడంతో అతడిని ట్విట్టర్ బ్లాక్ చేస్తానని, అతడి ఐడీ కూడా తనకు తెలుసునని, హరీష్ శంకర్ అన్నాడు. ముందు చెప్పేది వినాలన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే కథనాయిక. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ పతాకంపై టి.జి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా మిస్టర్ బచ్చన్ సినిమా ప్రీమియర్లు ఆగస్టు 14 నుంచే మొదలుకానున్నాయి.