Harish Shankar : హీరోయిన్‌కు లేని ప్రాబ్లం మీకేంటి?: హరీశ్ శంకర్

Update: 2024-08-14 10:02 GMT

‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో హీరో రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ మధ్య ఏజ్ గ్యాప్‌పై భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో దర్శకుడు హరీశ్ శంకర్ ఘాటుగా స్పందించారు. ‘మన ఇంట్లో అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు వయస్సు, మిగతావి అన్నీ చూసుకోవాలి. ఇది సినిమా. హీరోకు స్క్రీన్ ఏజ్ అనేది ఒకటి ఉంటుంది. సినిమాకు ఒప్పుకునే అమ్మాయి(హీరోయిన్)కే సమస్య లేనప్పుడు, మీకేంటి ప్రాబ్లం?’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

హరీశ్ శంకర్ తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా ఎదిగారు. ముఖ్యంగా రీమేక్ సినిమాలను ఆయన హ్యాండిల్ చేసే విధానం నెక్ట్స్ లెవెల్. మాతృకలోని కాన్సెప్ట్‌ను మాత్రమే తీసుకుంటూ హీరోలకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాకు కొత్త ఫీలింగ్ తీసుకొస్తారు. గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేశ్ సినిమాలే దానికి ఉదాహరణ. రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’లోనూ ఈ ఫార్ములా వర్కౌట్ అయితే మరో హిట్ ఖాతాలో వేసుకున్నట్లే.

రేపు థియేటర్లలో నాలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’, రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’, కోలీవుడ్ హీరో విక్రమ్ ‘తంగలాన్’, ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ‘ఆయ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ఈ నాలుగు సినిమాలపై భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి మీరు ఏ సినిమాకు వెళ్తున్నారో కామెంట్ చేయండి.

Tags:    

Similar News