Harish Shankar : చిరంజీవి ఓకే అంటే రామ్ కు హ్యాండ్ ఇస్తాడా ..

Update: 2024-08-06 09:20 GMT

టాలీవుడ్ లోని డాషిండ్ డైరెక్టర్స్ లో హరీశ్ శంకర్ ఒకడు. కథ ఏదైనా తనదైన శైలిలో ప్రెజెంట్ చేస్తాడు. రీమేక్ చేసినా అందులోనూ తన ముద్ర స్పష్టంగా ఉంటుంది. ప్రస్తుతం రవితేజతో అతను చేసిన మిస్టర్ బచ్చన్ కూడా రీమేకే. ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ మూవీ తర్వత తను రామ్ పోతినేనితో ఓ సినిమా చేయబోతున్నా అని అతనే ప్రకటించాడు. అయితే లేటెస్ట్ గా మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. హరీశ్ శంకర్ .. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఓ కథ నెరేట్ చేశాడట. అన్నీ కుదిరితే ఈ కథ కూడా పట్టాలెక్కుతుందని టాక్.

చిరంజీవి ఇప్పుడు విశ్వంభర అనే మూవీ చేస్తున్నాడు. సోషియో ఫాంటసీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్ట్ చేస్తున్నాడు. విశ్వంభరకు సంబంధించి మెగాస్టార్ పోర్షన్ అంతా ఆగస్ట్ చివరికి పూర్తవుతుందని బలంగా చెబుతున్నారు. ఆ తర్వాత దసరా నుంచే చిరంజీవి మరో కొత్త సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఆయన పెద్దగా గ్యాప్ ఇవ్వాలనుకోవడం లేదు. అందుకే వీలైనన్ని ఎక్కువ కథలు వింటున్నాడు. ఈ క్రమంలోనే హరీష్ స్టోరీ కూడా ఉన్నాడు. వీటిలో ఏదో ఒక కథను తనే ఫైనల్ చేసుకుంటాడు. ఆ దర్శకుడితో ఆయన నెక్ట్స్ మూవీ ఉంటుంది.

ఇక హరీశ్ శంకర్ స్టోరీ ఓకే అయితే ముందుగా ఇదే పట్టాలెక్కాలి. చిరంజీవి వెంటనే స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి వేరే ఆప్షన్ ఉండదు. అప్పుడు ఆల్రెడీ కమిట్ అయిన రామ్ పోతినేనికి హ్యాండ్ ఇవ్వడమో లేదా చిరంజీవి తర్వాతో చేయాల్సి ఉంటుంది. సో.. మెగాస్టార్ డెసిషన్ పైనే హరీశ్ శంకర్, రామ్ పోతినేని సినిమా ఫ్యూచర్ ఉంటుందని చెప్పొచ్చు. 

Tags:    

Similar News