హరీస్ జయరాజ్ మ్యూజిక్ ఇస్తే సినిమా ఫట్టేనా..

Harris Jayaraj: హరీస్ జయరాజ్ సంగీత ప్రియులకు ఈ పేరు కొత్తేమి కాదు.

Update: 2021-08-08 11:15 GMT

Harris Jayaraj: హరీస్ జయరాజ్.. సంగీత ప్రియులకు ఈ పేరు కొత్తేమి కాదు. తన మ్యూజిక్ తో శ్రోతలని ఉర్రుతలూగించాడు ఈ మ్యూజిక్ మాంత్రికుడు. ముక్యంగా ఆయన కంపోజ్ చేసిన మెలోడీలకి కుర్రకారులో మచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా వెస్ట్రన్ మ్యూజిక్ కి నేటివ్ టచ్ ఇస్తూ ఆయన చేసే పాటలకి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే.

ఏ ఆర్ రహమాన్ దగ్గర ఎన్నో పాటలకి రికార్డింగ్స్ లో పని చేసిన హరీస్ జయరాజ్.. తమిళ్ డైరెక్టర్ గౌతం వాసుదేవ్ మీనన్ దర్శకత్వం లో 2001లో వచ్చిన "మిన్నాలే" అనే తమిళ్ మూవీకి తొలిసారి సంగీతాన్ని అందించారు . ఇదే మూవీని "చెలీ" పేరుతో తెలుగులో రిలీజ్ చేసారు. మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచినా ఈ సినిమాకి గాను హరీస్ జయరాజ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నాడు.

మొదటి సినిమాకే ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్న హరీస్.. వరుస సినిమాలతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. కొద్దికాలంలోనే అజిత్, విక్రమ్, సూర్య, విజయ్, విశాల్, అర్జున్ వంటి స్టార్ హీరోలకి మ్యూజిక్ అందించే అవకాశం దక్కించుకున్నాడు . అదే క్రమంలో సూర్య హీరోగా లో 2003లో వచ్చిన "కాఖా కాఖా" అనే సినీమాకి తమిళనాడు బెస్ట్ మ్యూజిక్ అవార్డు, ఐఫా అవార్డు కూడా అందుకున్నాడు.

ఇక 2005లో స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన "అపరిచితుడు" సినిమాకి హరీస్ జయరాజ్ అందించిన సంగీతం సినిమాకే హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా ఆ సినిమాకి హరీస్ జయరాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా విజయంలో ప్రముఖ పాత్ర పోషించింది. ఆ సినేమాలోని "R E M O రేమో" అనే సాంగ్ ఇప్పటి యువత మొబైల్స్ లో వినిపిస్తూనే ఉంటుంది.

అయితే తమిళనాట రికార్డ్స్ క్రియేట్ చేసిన హరీస్ జయరాజ్ రికార్డు టాలీవుడ్ లో మాత్రం అందుకు పూర్తి బిన్నంగా ఉంది. ఆయన తెలుగులో సంగీతం అందించిన ఏ ఒక్క సినిమా కుడా బాక్స్ ఆఫీసు వద్ద సరిగా అడలేదు. తెలుగులో వెంకటేష్ నటించిన "వాసు" సినిమాకి తొలిసారి సంగీతం అందిచాడు కాని ఆ సినిమా అంతగా ఆడలేదు. ఆ తురువాత టాలీవుడ్ టాప్ హీరోలతో పనిచేసిన హారిస్ వరుసగా ఘర్షణ, సైనికుడు, మున్నా, అరేంజ్, స్పైడర్ వంటి సినిమాలకి సంగీతాన్ని అందించినా ఒక్కటి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలవలేకపోయాయి.

రాంచరణ్ నటించిన అరేంజ్ సినిమాకి ఎవర్ గ్రీన్ మ్యూజిక్ అందించినా.. ఫలితంలో మాత్రం మారలేదు. అందుకే హరీస్ జయరాజ్ తెలుగులో మ్యూజిక్ ఇస్తే ఆ సినిమా ఫట్టేనా అనుకుంటున్నారు సినీ ప్రేక్షకులు.

Full View


Tags:    

Similar News