Vrusshabha Movie : బిగ్గెస్ట్ డిజాస్టర్ గా డిక్లేర్ అయినట్టేనా

Update: 2025-12-27 12:15 GMT

కెరీర్ లో ఎన్నో హిట్స్ ఫ్లాప్స్ ఉంటాయి. కానీ కొన్ని మూవీస్ మాత్రమే ఆల్ టైమ్ డిజాస్టర్ గా డిక్లేర్ అవుతాయి. అలాంటిదే మోహన్ లాల్ మూవీ వృషభ. ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ మూవీ ఆ స్థాయిలోనే డిజాస్టర్ గా డిక్లేర్ అయింది. మామూలుగా మోహన్ లాల్ మూవీస్ లో ఇలాంటివి చూడటం అరుదు. ఆ అరుదైన మూవీస్ లిస్ట్ లోనే డిజాస్టర్ గా డిక్లేర్ అయింది వృషభ. దాదాపు రెండేళ్లకు పైగా చిత్రీకరణ చేశారు ఈ మూవీ కోసం. ఇప్పటి వరకు మోహన్ లాల్ మూవీస్ చేయలేనంతగా విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ వాడారు. ఆ స్థాయిలోనే సినిమా ఉండబోతోంది అనిపించారు. ట్రైలర్స్ సైతం ఆకట్టుకున్నాయి. కంటెంట్ పరంగా సూపర్బ్ అవుట్ పుట్ అవుతుంది అనుకున్నారు. బట్ ఆ స్థాయిలో లేదు వృషభ.

ఎందుకోగాని మళయాలంలో ఇంకాస్త ఎక్కువ డిక్లేర్ గా నిలిచిపోయింది ఈ మూవీ. ఇతర భాషల్లో టైమ్ ను బట్టి, స్థాయిలను బట్టి రిలీజ్ అయినా కూడా.. ఆ స్థాయిలో మాత్రం డిజాస్టర్ గా మారలేకపోయింది. నంద కిశోర్ డైరెక్షన్ లో వచ్చిందీ మూవీ. మోహన్ లాల్ తో పాటు సమర్ జిత్ లంకేష్ మరో హీరోగా నయన్ సారిక, రాగిని ద్వివేదీ, అజయ్, నేహా సక్సేనా, వినయ్ వర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శ్యామ్ సిఎస్ మ్యూజిక్ అందించాడు. అయినా మూవీ మాత్రం రిజల్ట్ లో తేడా కొట్టింది.

ఈ తరహా రెండు జన్మల కథాంశంతో అంటే చాలా రిస్క్ తో కూడుకున్న కథ. ఆ విషయంలో దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. బట్ ఈ విషయంలో తీసుకోలేదు. దీంతో రిజల్ట్ అలా వచ్చింది. మొత్తంగా దేశవ్యాప్తంగానే అసలు పెద్దగా ప్రమోషన్స్ కూడా లేని మూవీ అయినా.. రిజల్ట్ పరంగా మాత్రం బాగా డిజప్పాయింట్ చేసిందీ మూవీ. తెలుగులో అయితే అసలు ఎవరూ పట్టించుకోలేదు. ఒకేఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టారు తప్ప.. ఆ తర్వాత సినిమా గురించి ఏం మాట్లాడలేదు. విచిత్రంగా మోహన్ లాల్ ఈ మూవీ విషయంలో ముందుగానే చేతులెత్తేసినట్టు కనిపించింది. అందుకే నామ మాత్రపు ప్రమోషన్స్ తో మాట్లాడాడు. ఓవరాల్ గా చూస్తే మంచి అంచనాలు ఉన్న వృషభ రిజల్ట్ పరంగా తీవ్రంగా నిరాశపరిచింది. 

Tags:    

Similar News