మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన సినిమా వార్ 2. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మించింది. వైఆర్ఎఫ్ లోని స్పై వర్స్ లో భాగంగా రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటించింది. గత చిత్రాల్లో నటించిన వారంతా కేమియో అప్పీరియన్స్ గా కనిపిస్తారు అనే ప్రచారం కూడా ఉంది. అంటే షారుఖ్ ఖాన్, దీపికా పదుకోణ్, సల్మాన్ ఖాన్, అలియా భట్ లాంటి వాళ్లన్నమాట. ఇక ఆగస్ట్ 14న విడుదల కాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్స్ ఆశించిన స్థాయిలో లేవు. ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ వీడియో తప్ప పెద్దగా సందడి కనిపించలేదు. ఈ విషయంలో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ అసంతృప్తిగానే ఉన్నారు. ఇది మేకర్స్ వరకూ వెళ్లిందేమో.. త్వరలోనే ట్రైలర్ విడుదల చేయబోతున్నారు అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
వార్ 2 ట్రైలర్ ను ఈ నెల 23న విడుదల చేయబోతున్నారు ప్రచారం జరుగుతోంది. ఇంకా డేట్ అఫీషియల్ గా కన్ఫార్మ్ కాలేదు కానీ.. ఆల్మోస్ట్ ఆ రోజునే ట్రైలర్ విడుదలవుతుందంటున్నారు. ఇప్పటికే ట్రైలర్ కట్ రెడీ అయిపోయిందట. ట్రైలర్ నిడివి 2 నిమిషాల 50 సెకన్లు అంటున్నారు. అంటే ట్రైలర్ తోనే కంటెంట్ రేంజ్ ను అంచనా వేయొచ్చు. ఈ బ్యానర్ లో స్పై వర్స్ లో భాగంగా వచ్చిన చిత్రాలన్నీ భారీ బడ్జెట్ తో బిగ్ కాన్వాస్ తోనే కనిపించాయి. సో.. వార్ 2 కూడా అందుకే ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందనే చెప్పాలి. మొత్తంగా ఈ ట్రైలర్ వస్తే మన ఎన్టీఆర్ కు సినిమాలో ఎంత స్పేస్ ఉండబోతోందో కూడా అంచనాకు రావొచ్చు.