మెగాస్టార్ చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు మూవీ బిగ్గెస్ట్ కావడంతో రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. అయితే దీనికంటే పూర్తయిన విశ్వంభర అప్డేట్స్ విషయంలో మాత్రం బాగా ఆలస్యం చేస్తున్నారు. నిజానికి ఈ మూవీ గతేడాదే విడుదల కావాల్సి ఉంది. బట్ విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పెద్ద మైనస్ కావడంతో సినిమా ఆగిపోయింది. ఆ క్రాఫ్ట్ వర్క్ మొత్తం మళ్లీ మొదటి నుంచి ప్రారంభించారు. ఈ కారణంగానే విడుదలకు బాగా ఆలస్యం అవుతోంది. వశిష్ట డైరెక్షన్ లో రూపొందిన సినిమా ఇది. చిరంజీవితో పాటు త్రిష హీరోయిన్ గా అలాగే అషికా రంగనాథ్, సురభి ఇతర కీలక పాత్రల్లో నటించారు. నటన పరంగా మాత్రం అంతా క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది. మిగిలిపోయిన ఒక పాటను కూడా పూర్తి చేశాడు చిరంజీవి. ఈ పాట మాత్రం పెద్దగా ఆకట్టుకునేలా లేదు.
ఇక మన శంకరవరప్రసాద్ గారు విజయం వల్ల ఈ మూవీకి మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారు టీమ్. దీంతో ఈ సమ్మర్ కు సినిమా విడుదలవుతుందని నమ్మకం కుదరడం లేదు అని టాక్. మామూలుగా సమ్మర్ అంటే మార్చి నుంచి జూన్ వరకు ఈ సీజన్ ను చూస్తుంటారు మనవాళ్లు. బట్ ఈ మూవీని జూలైలో విడుదల చేయాలని మాత్రం భావిస్తున్నారట. అంటే విశ్వంభర రిలీజ్ డేట్ జూలైలో ఉండబోతోంది అనే టాక్ బలంగా వినిపిస్తుంది. బట్ మన శంకరవరప్రసాద్ గారు జోష్ లో ఉండగానే ఈ చిత్రాన్ని కూడా విడుదల చేస్తేనే బెటర్ గా ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. కానీ అది కుదరడం లేదుట. మొత్తంగా విశ్వంభర జూలైలో అయినా విడుదలవుతుందా లేదా అనేది చూడాలి.