స్టార్ బ్యూటీ నయనతార షాకింగ్ కామెంట్స్ చేసింది. తన ప్రియుడు తనను యాక్టింగ్ మానేయమన్నాడని, ఆ సమయంలో చాలా ఎమోషనల్ అయ్యాను అని ఆమె చెప్పింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే నయనతారపై నెట్ ఫ్లిక్స్ సంస్థ డాక్యుమెంటరీ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో నయనతార మాట్లాడుతూ "నా చివరి సినిమా శ్రీరామరాజ్యం అనుకున్నాను. ఆ తరువాత నా మాజీ ప్రియుడు నాకు పెళ్లి తరువాత యాక్టింగ్ చేయకూడదు అనే కండిషన్ పెట్టాడు. నేను కూడా ఒకే అన్నాను. కానీ, తరువాత మా రిలేషన్ షిప్ బ్రేక్ అయ్యింది" అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె కోరోయోగ్రాఫర్ ప్రభుదేవా గురించి చెప్పినట్టు క్లియర్ గా అర్థమవుతోంది.