Cardiac Arrest : 40 ఏండ్లకే అలసిపోతున్న గుండె

Update: 2024-10-08 05:45 GMT

ఇటీవల నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. 38 ఏండ్లకే ఆమె గుండెపోటు కారణంగా మృతిచెందారు. 40 ఏండ్లలోపే గుండెకు సంబంధించిన సమస్యలతో చనిపోతున్న వారి సంఖ్యపెరుగుతోంది. అయితే, ఇందులో కార్డియాక్ అరెస్ట్(గుండె ఆగిపోవడం) ఘటనలు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. గతంలో కన్నడ స్టార్ యాక్టర్ పునీత్ రాజ్ కుమార్, టాలీవుడ్ హీరో తారకరత్న, ఏపీ మాజీ మంత్రి గౌతం రెడ్డి.. వీరంతా కార్డియాక్ అరెస్టుల కారణంగానే చనిపోయారు. ప్రెజర్, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం, ఫిజికల్ వర్క్ చేయకపోవడం, ఎక్సర్ సైజ్ లు చేయకపోవడం లాంటివి హెల్త్ ఇష్యూస్ కు దారితీస్తున్నాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యం దెబ్బతిని ఎంతోమంది హఠాత్తుగా గుండె పోటు బారినపడుతున్నారు. అది కూడా 40 ఏండ్లలోపే. ఇలాంటి పరిస్థితుల్లో లైఫ్​ స్టైల్ ను మార్చుకోకపోతే గుండె అలసిపోతుందనే విషయాన్ని గుర్తించాలి.

కార్డియాక్ అరెస్ట్..

సడెన్ గా గుండె కొట్టుకోవడం ఆగిపోతే కార్డియాక్ అరెస్ట్ అంటారు. 40 ఏండ్లలోపు కార్డియాక్ అరెస్ట్ తో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గుండె కొట్టుకోకపోవటం వల్ల రక్త సరఫరా నిలిచిపోయి స్పృహ తప్పుతారు. ఇది నిమిషాల్లోనే ప్రాణం మీదికి తెస్తుంది. అదృష్టం కొద్దీ కొందరికి కొన్ని గంటల ముందుగా ఛాతీనొప్పి, ఆయాసం, వికారం, వాంతి, తల తేలినట్టు అనిపించటం, నిస్సత్తువ వంటి హెచ్చరిక సంకేతాలు కనిపిస్తుంటాయి. వీటిని నిర్లక్ష్యం చేయటానికి లేదు. మహిళల విషయంలోనైతే మరింత జాగ్రత్త అవసరం. ఎందుకంటే మగవారిలో, ఆడవారిలో ఈ హెచ్చరిక సంకేతాలు భిన్నంగా ఉంటున్నట్టు స్టడీస్ చెబుతున్నాయి. మగవారు చాలావరకూ ఛాతీనొప్పికి గురవుతుంటే ఆడవారిలో ప్రధానంగా ఆయాసం తలెత్తుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. కొందరికి వికారం, వాంతి, నిస్సత్తువ వంటివీ ఉండొచ్చు. ఇవి అస్పష్టంగా ఉండటం వల్ల చాలామంది నీరసమనో, బలహీనతనో పొరపడు తుంటారు. మహిళల్లో గుండెజబ్బును తొలిదశలో గుర్తించలేపోవటానికి ఇదీ ఒక కారణమే. అందువల్ల గుండె ఆరోగ్యం విషయంలో మహిళల్లో మరింత జాగ్రత్త అవసరం.

Tags:    

Similar News