'Heartbroken': సంగీత కచేరీలో తొక్కిసలాట.. సంతాపం వ్యక్తం చేసిన సింగర్

కొచ్చిలో సంగీత కచేరీలో ఆకస్మిక ఘటన.. తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు మృతి

Update: 2023-11-26 04:01 GMT

కొచ్చిలో సంగీత కచేరీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు మరణించడం తన హృదయాన్ని కలచివేసిందని గాయని నిఖితా గాంధీ అన్నారు. ఈ ఘటనలో మరణించిన నలుగురు విద్యార్థులతో పాటు, మరో 64 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో స్పందించిన గాందీ.. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ చేశారు. ఆమె ఈ సంఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. ఇది "దురదృష్టకరం" అని ఆమె పేర్కొన్నారు.

"ఈ సాయంత్రం కొచ్చిలో జరిగిన సంఘటనతో హృదయవిదారకంగా అనిపించింది. ప్రదర్శన కోసం నేను వేదికపైకి వెళ్లేలోపే ఇటువంటి దురదృష్టకర సంఘటన జరిగింది. ఈ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేయడానికి పదాలు సరిపోవు. విద్యార్థులు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి " అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.


కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (క్యూశాట్)లో తొక్కిసలాట జరిగింది. నలుగురు విద్యార్థులు - ఇద్దరు బాలికలు, ఇద్దరు అబ్బాయిలు. వీరిని ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మరణించారు. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో పక్కనే నిలబడి ఉన్న కొందరు వ్యక్తులు ఆశ్రయం కోసం ఒకే ప్రాంతానికి చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో మెట్లపై నిల్చున్న వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లడంతో కిందపడిపోయారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అదే గేటు నుండి వేదికలోకి ప్రవేశం, నిష్క్రమణ కూడా తొక్కిసలాటకు కారణమైందని మున్సిపల్ కౌన్సిలర్ ఒకరు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కలమస్సేరి మెడికల్ కాలేజీ, కిండర్ ఆసుపత్రికి తరలించారు.

Tags:    

Similar News