చిత్తూరు జిల్లా..
మోదుగులపాళెం అనే ఓచిన్న గ్రామంలో పుట్టిన
సాధారణ వ్యక్తి అతను
అనుకోకుండా కళామతల్లి ఒడికి చేరాడు
అటుపై ఆ తల్లికే ఆభరణమై..
ఎందరికో ఆదర్శమై నిలిచాడు
నలభైయేళ్లకు పైగా సుదీర్ఘయానంలో
ఎన్నో ఆటుపోట్లు.. మరెన్నో మధుర విజయాలు
జీవితమంటే స్వర్గం నరకంల కలయిక అనుకుని
అన్నిటినీ ఆనందంగా స్వీకరించిన ధీశాలి
ఆయనే..
మంచు భక్తవత్సలం నాయుడు అలియాస్ మోహన్ బాబు
సినిమా శక్తి దాసరి పరిచయం
ఆయన దారిని రహదారిగా మార్చింది..
అటుపై క్రమశిక్షణను చుక్కానిగా చేసుకుని
సినీ వినీలాకాశంలో ధృవతారై వెలిగాడు
నటుడిగా మోహన్ బాబు ప్రతిభ శిఖరమంత
విలన్ పాత్రలు చేసినా
విజిల్స్ వేయించుకున్న ఏకైక నటుడాయన
డైలాగ్స్ తో మోహన్ బాబు చెప్పినన్ని మాడ్యులేషన్స్
ప్రపంచ సినిమాలో మరెవ్వరూ చెప్పలేదు
ఆయన డైలాగ్స్ చెబితే థియేటర్ దద్దరిల్లిపోతుంది
తెలుగుభాష పులకించి పోతుంది
కళాకారుడిగానే మిగిలిపోకుండా
నిర్మాతగా,అరుదైన విద్యావేత్తగా..
ఓ గొప్ప తండ్రిగా
అన్నగారి మాటలను శిరోధార్యంగా చేసుకుని
మోహన్ బాబు సాగిస్తోన్న ప్రయాణం
అనన్య సామాన్యం..
ఇకపై తనకే సొంతమైన ఎన్నో పవర్ ఫుల్ రోల్స్ తో
మనల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటూ
నట ప్రపూర్ణ మోహన్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతోంది టివి5 ఎంటర్టైన్మెంట్ టీమ్.
- బాబురావు కామళ్ల